IPL 2022: ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే సీన్ లేదు.. ప్లే ఆఫ్స్ కూడా చేరదు: ఆకాశ్ చోప్రా

ముంబై: కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో బరిలోకి దిగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈ సారైనా టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్న అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన మాటలతో షాకిచ్చాడు. ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే సీన్ లేదని, కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదని అంచనా వేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆర్‌సీబీ టీమ్ గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ఆర్‌సీబీ అభిమానుల మనసులు గాయపడేలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌సీబీ మ్యాచ్ విన్నర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ హై రిస్క్ ప్లేయరని, అతనిపై పూర్తి నమ్మకం ఉంచలేమన్నాడు.

టైటిల్ దేవుడెరుగు..?
'ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కూడా చేరుకోదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది తప్పు కూడా కావచ్చు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ కూడా చేరవచ్చు. కానీ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారి పడితే మాత్రం నేనేం ఆశ్చర్యపోను. ఆర్‌సీబీకి టాపార్డర్‌లో ఫాఫ్ డుప్లెసిస్.. లోయరార్డర్‌లో దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ ఉన్నారు. వారు హసరంగాపై చాలా డబ్బులు ఖర్చు చేశారు. రాహుల్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లను తీసుకోకుండా హసరంగాకు అంత డబ్బు చెల్లించడం నన్ను ఆశ్చర్యపరిచింది. గతంలో లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఉన్న కష్టాలు ఇప్పటికి అలానే ఉన్నాయి.

మ్యాక్సీని నమ్మలేం..
గత సీజన్‌లో మ్యాక్స్‌వెల్ అద్భుతంగా రాణించాడు. ఐదేళ్లుగా విఫలమైన అతను.. గతేడాది మాత్రం దుమ్మురేపాడు. అతను ఈ సీజన్ కూడా అదే జోరు కనబర్చవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను హై రిస్క్ ప్లేయర్, అతనిపై పూర్తి నమ్మకం ఉంచలేం. ఎందుకంటే అతని చుట్టూ అస్థిర వాతావరణం ఉంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఫాఫ్ సారథ్యంలో..
గత సీజన్‌తోనే విరాట్ కోహ్లీ సారథ్య బాథ్యతలను వదులుకోవడంతో ఈ సీజన్ మెగావేలంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్‌కు ఆర్‌సీబీ కెప్టెన్సీ ఇచ్చిన విషయం తెలిసిందే. సారథి మారడంతో ఈసారైనా టైటిల్ సాధించాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. చివరగా 2016లో ఫైనల్ వరకు వెళ్లిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత మూడేళ్లు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కానీ గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ వరకు వచ్చినా.. లక్ష్యాన్ని అందుకోలేదు.
బౌలింగ్ సూపర్..
ప్రతిసారి బ్యాటింగ్ బలంతో బరిలో దిగే ఆర్‌సీబీ ఈసారి మాత్రం బౌలింగ్ విభాగం కాస్త బలంగా కనిపిస్తోంది. వేలానికి ముందు జెమీసన్ ను వదులుకున్న ఫ్రాంచైజీ అతడి ప్లేస్ లో మరో పొడగరి హేజిల్‌వుడ్ ను తీసుకుంది. తను లాస్ట్ సీజన్ లో చెన్నై టీమ్ విక్టరీతో పాటు గతేడాది ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
అతనికి తోడు గతేడాది పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా కీలకం కానున్నాడు. ఇక సిరాజ్, సిద్దార్థ్ కౌల్ రూపంలో మరో ఇద్దరు ఇండియా బౌలర్లు, బెరెండార్ఫ్, డేవిడ్ విల్లే రూపంలో ఫారిన్ పేసర్లు ఉండనే ఉన్నారు. స్పిన్‌లో నంబర్ వన్ ఆల్ రౌండర్ వానిందు హసరంగ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. అలాగే షాబాజ్ అహ్మద్, కర్ణ్ శర్మ, లామ్రోర్ వంటి ఇండియా స్పిన్నర్లతో పాటు మ్యాక్స్‌వెల్ కూడా తన బంతితో మాయ చేయగలగడం ఈ టీమ్ కు ప్లస్ అనొచ్చు. ఇక కెప్టెన్ డుప్లెసిస్ కూడా టీమ్‌కు సానుకూలంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications