ఎన్ని చెప్పినా అతను లేకుంటే ఆర్‌సీబీ గెలిచేదే కాదు: ఆకాశ్ చోప్రా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవడానికి అతని అద్భుత ఇన్నింగ్సే కారణమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
ముందుగా బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) చెలరేగగా.. ఆ తర్వాత బౌలింగ్‌లో హజెల్ వుడ్ దుమ్మురేపాడు. నాలుగు కీలక వికెట్లతో లక్నో ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ఎన్ని చెప్పినా ఫాఫ్ లేకుంటే ఆర్‌సీబీ గెలిచేదే కాదన్నాడు.

స్టార్ పెర్ఫార్మర్ ఫాఫే..
'నాలుగు వికెట్లు తీసిన హజెల్ వుడ్ కంటే ఫాఫ్ డుప్లెసిసే స్టార్ పెర్ఫామర్ అంటాను. జోష్ హజెల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసిన మాట వాస్తవమే. కానీ అతను పోరాడేలా అవకాశం ఇచ్చింది మాత్రం ఫాఫ్ డుప్లెసిసే. అతనే గనుక రాణించకుండా ఉంటే ఆర్‌సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. నిజాయితీగా మాట్లాడుకుంటే తొలి ఓవర్‌లోనే ఆర్‌సీబీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దుష్మంత్ చమీరా బౌలింగ్‌లో అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ వరుస బంతుల్లో ఔటయ్యారు.

సెంచరీ చేయకున్నా..
కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితులను చూసి ఎవరైనా ఆర్‌సీబీ పని అయిపోయిందనుకున్నారు. క్రీజులోకి వచ్చిన మ్యాక్సీ సైతం కొన్ని బౌండరీలు బాది వెనుదిరిగాడు. షెహ్‌బాజ్, దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చినా ఫాఫ్ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆడాడు. దురదృష్టవశాత్తు సెంచరీ అందుకోలేకపోయాడు. అయినా అతను చేసిన 96 పరుగులు సెంచరీ కంటే ఎక్కువే. అతను అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు.

బిష్ణోయ్‌కు చుక్కలు..
లక్నోలో ముప్పుగా భావించిన బౌలర్లనే ఫాఫ్ టార్గెట్ చేశాడు. రవి బిష్ణోయ్‌ను చీల్చి చెండాడాడు. అతని దెబ్బకు బిష్ణోయ్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఆరంభంలో దుష్మంత చమీరాను గౌరవించినా ఆ తర్వాత చెడుగుడు ఆడాడు. ఆవేశ్ ఖాన్‌ను సైతం వదల్లేదు. ఫాఫ్ పూర్తిగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి జట్టు పోరాడగల లక్ష్యాన్ని అందించాడు. కెప్టెన్సీలో కూడా అదరగొట్టాడు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆర్‌సీబీ జోరు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. లక్నో బౌలర్లలో దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్(24 బంతుల్లో 3 ఫోర్లతో సిక్స్‌తో 30), కృనాల్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ నాలుగు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications