
కలిసొచ్చిన ఆ ఇద్దరిపై వేటు.
.
జట్టులో నుంచి అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్‌ను తప్పించడంతో టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. వరుసగా విజయాలు సొంతమవుతున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందే అబ్దుల్ సమద్‌ను రూ.4 కోట్లకి రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ .. రొమారియో షెఫర్డ్‌ను రూ.7.75 కోట్ల భారీ ధరకు వేలంలో కొనుగోలు చేసింది. ఈ ఇద్దరికీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కగా.. అబ్దుల్ సమద్ (4, 0) దారుణంగా విఫలమయ్యాడు. ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో 1/33, 42/2తో అంచనాల్ని అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ 24, 8 పరుగులు చేసి కీలక సమయాల్లో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.

ఓపెనింగ్ జోడీ సెట్ అవ్వడం..
స్టార్ ఓపెనర్లు లేకపోవడంతో సన్‌రైజర్స్.. కెప్టెన్ కేన్ మామతో పాటు అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా ఆడిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఈ ఇద్దరూ తర్వాతి మ్యాచ్‌ల్లో లయ అందుకున్నారు. చెన్నైతో మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ 42 పరుగులు చేశాడు. అలానే కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. దాంతో.. ఓపెనింగ్ సమస్య కొద్దిగా తీరింది. అలానే నెం.3లో ఆడుతున్న రాహుల్ త్రిపాఠికి టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్‌లో త్రిపాఠి డకౌటైనా అదే స్థానంలో కొనసాగించడంతో.. అతను తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో 44, 39*, 17 (రిటైర్డ్ హర్ట్), 71 పరుగులతో సత్తాచాటాడు. దాంతో.. టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గింది.

మిడిలార్డ్ రాణిస్తుండటం..
ఇక రూ.10.75 కోట్లకి కొనుగోలు చేసిన పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ సన్‌రైజర్స్ చిన్న మార్పు చేసింది. మ్యాచ్ గమనానికి అనుగుణంగా అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి పంపుతూ వస్తోంది. దాంతో.. అతని కంటే ముందు బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి, మర్‌క్రమ్ స్వేచ్ఛగా ఆడేస్తున్నారు. అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్‌పై వేటుతో పూరన్‌లో కూడా జాగ్రత్త పెరిగింది. తొలి రెండు మ్యాచ్‌ల తరహాలో బ్యాట్‌ని అడ్డదిడ్డంగా ఊపేయడం లేదు.
మర్‌క్రమ్ జోరు మీదున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. త్రిపాఠి, మర్‌క్రమ్ రాణిస్తుండటంతో అటు ఓపెనర్లు ఇటు తర్వాతి వచ్చే బ్యాటర్లు స్వేచ్చగా ఆడుతున్నారు. హైదరాబాద్ గెలిచిన చివరి మూడు మ్యాచ్‌ల్లో మార్క్‌రమ్, త్రిపాఠిలో ఎవరో ఒకరు చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించారు.

బౌలింగ్ పదును పెరగడం..
సీజన్ ఆరంభంలో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలం మ్యాచ్ మ్యాచ్‌కు పుంజుకుంది. రొమారియో షెఫర్డ్ స్థానంలో మార్కో జాన్సెన్‌ను జట్టులోకి తీసుకోవడం మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఎడమచేతి వాటం పేసరైన జాన్సెన్, మరో లెప్ట్ హ్యాండర్ టి.నటరాజన్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లతో ఆడేసుకుంటున్నాడు. సీనియర్ల సపోర్ట్‌తో ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా లయ అందుకోవడంతో.. భువనేశ్వర్ కుమార్ పని సులువైంది. ఈ నలుగురు పేసర్లు విసిరిన పదునైన యార్కర్లని అడ్డుకునేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టుకు తీరని నష్టం అయినా.. పేసర్లు అతని లేని లోటు తీరుస్తున్నారు. సమష్టి విజయాలతో దూసుకెళ్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం సులువు.


Click it and Unblock the Notifications
