
కేన్ మామ క్యాచ్ ఔట్..
ఐపీఎల్ 2022 ప్రారంభమైన మూడో రోజే అంపైర్ ఘోర తప్పిదం చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ బ్యాట్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ సంజూ శాంసన్ గ్లోవ్స్‌ను తాకుతూ స్లిప్‌లో ఉన్న పడిక్కల్ వైపు దూసుకెళ్లింది. ఇక ఆ బంతిని పడిక్కల్ అందుకోగా.. ఈ క్యాచ్‌పై సందేహం కలగడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అయితే రిప్లేలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని ఔటిచ్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేసింది. అభిమానులు సైతం థర్డ్ అంపైర్‌పై దుమ్మెత్తిపోసారు.

విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ..
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ అంపైర్ల తప్పిదానికి ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై యువ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ వేసిన 19 ఓవర్ తొలి బంతి వికెట్ల మీదకు దూసుకు రాగా.. విరాట్ కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్, ప్యాడ్‌ను తాకింది. దాంతో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్‌కు తాకిందనే కాన్ఫిడెన్స్‌తో విరాట్ కోహ్లీ వెంటనే రివ్యూ తీసుకున్నాడు.
రిప్లేలో పలు కోణాల్లో థర్డ్ అంపైర్ పరిశీలించగా.. బంతి బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌ను తాకినట్లు ఒక యాంగిల్‌లో కనిపించింది. మరో కోణంలో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. థర్డ్ అంపైర్ సైతం బంతి.. ప్యాడ్, బ్యాట్‌కు ఒకేసారి తాకిందన్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు కాబట్టి తాను బాల్ ట్రాకింగ్‌ను చెక్ చేస్తున్నానని థర్డ్ అంపైర్ తెలిపాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను హిట్ చేయడంతో ఔట్‌గా ప్రకటించాడు. నిబంధనల ప్రకారం బంతి బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినప్పుడు బ్యాట్‌కు తాకినట్లే పరిగణిస్తారు. దాంతో ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

మార్కస్ స్టోయినీస్- వైడ్ బాల్
అంపైర్ తప్పిదంతో మార్కస్ స్టోయినీస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. రాయలేని పదాలతో బూతులు తిడుతూ మైదానం వీడాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమైన సమయంలో అంపైర్ చేసిన ఘోర తప్పిదం స్టోయినీస్ అసహనానికి కారణమైంది. హజెల్ వుడ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దాదాపు క్రీజు బయట పడిన బంతిని వైడ్‌గా ఇవ్వకపోవడం అందర్నీ విస్మయ పరిచింది. ఆ ఫ్రస్టేషన్‌లో మరుసటి బంతికే స్టోయినీస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను.. అంపైర్లను అసభ్యపదజాలంతో దూషించాడు. అతన్ని మందలిస్తూ మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోగా.. అంపైర్‌పై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మండిపడ్డారు.

మెక్‌కాయ్ నోబాల్.. రిషభ్ పంత్ లొల్లి..
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నోబాల్ విషయంలో అంపైర్ చేసిన ఘోర తప్పిదం తీవ్ర దుమారానికి దారితీసింది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ఏకంగా తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయమన్నాడు. ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమవ్వగా... మెక్ కాయ్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్ వరుసగా మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే మెకాయ్ మూడో బంతిని హై ఫుల్ టాస్‌గా సంధించగా.. పావెల్ అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. అయితే ఈ బంతి నోబాల్‌లా అనిపించింది. కానీ అంపైర్ నితీన్ మీనన్ మాత్రం బాల్ డిప్ అవుతుందని భావించి ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అప్పటికే ఢిల్లీ డగౌట్‌లోని ప్లేయర్లు, కోచ్‌లు నో బాల్ అంటూ అరిచారు. థర్డ్ అంపైర్ సాయన్ని అయినా కోరండంటూ.. సూచించారు. కానీ నితీన్ మీనన్ మాత్రం స్పందించలేదు. దాంతో ఆగ్రహానికి గురైన పంత్ తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయమనడంతో మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఇక రిషభ్ పంత్ రూ.1.15 కోట్లు బొక్కపడ్డాయి.


Click it and Unblock the Notifications
