SRH vs GT: ఆ మూడు జరిగితే గుజరాత్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే విజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. లీగ్‌లో ఇప్పటి వరకు ఓటమే ఎరుగని నయా టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. నేడు(సోమవారం) డీవై పాటిల్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పరాజయంపాలైన సన్‌రైజర్స్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో సమష్టిగా రాణించి మట్టికరిపించింది. అయితే పేపర్‌పై గుజరాత్ టైటాన్స్.. ఆరెంజ్ ఆర్మీకంటే బలంగా కనిపిస్తోంది. పైగా గత మ్యాచ్‌లో గుజరాత్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు బాది విజయాన్నందుకుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే మూడు విషయాలు జరగాలి.

టాస్ గెలవడం..
రాత్రి మ్యాచ్ కాబట్టి డ్యూ కీ రోల్ పోషించనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం టాస్ గెలిస్తే చేజింగ్‌కే మొగ్గు చూపుతుంది. పైగా అంతగా బ్యాటింగ్ పవర్ లేని సన్‌రైజర్స్‌కు ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు చేసే సీన్ లేదు. కాబట్టి చేజింగ్ తీసుకొని ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తే విజయవకాశం ఉంటుంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ మాదిరి సన్‌రైజర్స్ రాణించాలి. ఇదంతా జరగాలంటే కేన్ మామ టాస్ గెలవాలి.

శుభ్‌మన్‌ను త్వరగా ఔట్ చేయాలి..
గుజరాత్ టైటాన్స్‌కు బ్యాటింగ్‌లో ప్రధాన బలం ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కాబట్టి సన్‌రైజర్స్ అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. పవర్ ప్లేలోనే అతని వికెట్ తీసి.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఔట్ చేస్తే.. గుజరాత్ బ్యాటర్లు ఒత్తిడిలో పడుతారు. అప్పుడు సన్‌రైజర్స్ బౌలర్ల పని సులవవుతుంది. ప్రణాళిక బద్దంగా బౌలింగ్ చేసి స్వల్ప స్కోర్ కట్టడి చేస్తే విజయవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ఓపెనర్ల శుభారంభం..
చేజింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్ల శుభారంభం చాలా ముఖ్యం. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ మాదిరి ఆడినా ఇతర బ్యాటర్లు మిగతా పని చూసుకుంటారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన ఫామ్ కొనసాగించాలి. కేన్ విలియమ్సన్.. నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, పూరన్, మార్క్‌రమ్, సుందర్ మిగతా పనని చూసుకుంటారు. లూకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్‌లను సన్‌రైజర్స్ బ్యాటర్స్ జాగ్రత్తగా ఆడాలి. గుజరాత్ ప్రధాన బలం బౌలింగేననే విషయం మరవద్దు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications