For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఆ మూడు జట్లతో ముంబై ఇండియన్స్‌కు కష్టాలు తప్పవు!

IPL 2022: 3 Teams that can give tough fight to Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథ్యంలోని ఆ జట్టు ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న అప్‌కమింగ్ సీజన్‌లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో లీగ్ సరికొత్తగా ఉండనుంది. కొత్త జట్లతో రాకతో మెగా వేలం అనివార్యమవ్వగా.. ఆయా జట్ల ఆటగాళ్లంతా మారారు. ఈ క్రమంలోనే అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్ చెల్లా చెదురైంది. గత సీజన్ మాదిరి బలంగా అయితే కనిపించడం లేదు.

దానికి తోడు కొత్తగా వచ్చిన గ్రూప్ సిస్టమ్.. ముంబైకి ప్రతికూలంగా మారింది. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా నంబరవన్ సీడింగ్ అందుకున్న ముంబై.. గ్రూప్‌-ఏ టాప్ టీమ్‌గా స్ట్రాంగ్ టీమ్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలోనే ఓ మూడు జట్లతో ముంబైకి కష్టాలు తప్పేలా లేవు. ఆ జట్లు ఏంటో ఓ లుక్కెద్దాం.

 చెన్నై సూపర్ కింగ్స్..

చెన్నై సూపర్ కింగ్స్..

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరం. లీగ్‌లోనే ఈ రెండు జట్లు సక్సెస్ ఫుల్ టీమ్స్. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 9 టైటిళ్లు రెండు జట్లే అందుకున్నాయంటే ఈ టీమ్స్ ఎంత బలమైనవో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్‌లో రెండు సార్లు తలపడ్డ ఈ జట్లు చెరొకసారి విజయాన్నందుకున్నాయి. ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై తమ పాత ఆటగాళ్లనే 8 మందిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ముంబై కంటే సీఎస్‌కే బలంగా కనిపిస్తోంది. దాంతో ఈ సారి కూడా ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. కొత్త గ్రూప్ సిస్టమ్ ప్రకారం అపోజిట్ గ్రూప్‌లలో ఉన్నా.. ఒకే స్థానంలో ఉన్న నేపథ్యంలో రెండేసి సార్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ ఏప్రిల్ 21న, రెండో మ్యాచ్ మే 12న జరగనుంది.

 ఢిల్లీ క్యాపిటల్స్..

ఢిల్లీ క్యాపిటల్స్..

చెన్నై తర్వాత ముంబైకి గట్టి పోటీనిచ్చే జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. లీగ్‌లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా గత మూడు సీజన్లు ఆ జట్టు దుమ్ములేపుతోంది. గత సీజన్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో ముంబైకి సవాల్ విసిరింది. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో అద్భుతమైన ఆటగాళ్లను తీసుకున్న ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. పృథ్వీ షా, అన్రిచ్ నోర్జ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, టీమ్ సీఫెర్ట్, రిషభ్ పంత్‌లో టీమ్ లైనప్ బలంగా ఉంది. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఆటగాళ్లున్నారు.

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రెండు సార్లు ఓడించింది. ఇరు జట్ల మధ్య ముఖా ముఖి పోరు కూడా హోరాహోరీగా ఉంది. ముంబై 16 సార్లు గెలిస్తే.. ఢిల్లీ 14 సార్లు విజయం సాధించింది. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో రెండేసి సార్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య మార్చి 27న తొలి మ్యాచ్, మే 21న రెండో మ్యాచ్ జరగనుంది.

 లక్నో సూపర్ జెయింట్స్..

లక్నో సూపర్ జెయింట్స్..

ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్ర చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కూడా ముంబైకి గట్టి పోటీ ఇవ్వనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఆ జట్టు మెగా వేలంలో మంచి ఆటగాళ్లనే తీసుకుంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, ఎవిన్ లూయిస్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు సెన్సేషనల్ బౌలర్లు అయిన రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లు కూడా ఉన్నారు. ఇతర జట్ల మాదిరే ముంబైకి కూడా రాహుల్ సేన గట్టి పోటీ ఇవ్వనుంది. పైగా గౌతమ్ గంభీర్ వంటి దూకుడు కలిగిన మాజీ ప్లేయర్ ఈ జట్టుకు మెంటార్‌. ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు గెలిచిన అతని అనుభవం లక్నోకు కలిసి రానుంది.

Story first published: Monday, March 14, 2022, 17:20 [IST]
Other articles published on Mar 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+