For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్‌దే అనడానికి మూడు బలమైన కారణాలు!

 IPL 2022: 3 reasons why Chennai Super Kings will win the title

హైదరాబాద్: ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ టీమ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇప్పటికే ఆ జట్టు నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. అంతేకాకుండా ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ మినహా ప్రతీ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్ అయినా చేరింది. పైగా గత సీజన్ చాంపియన్. మిగతా ఫ్రాంచైజీల మాదరిగా వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్లు లేకపోయినా.. స్కిల్డ్ ప్లేయర్లు లభించకపోయినా.. యంగ్ గన్స్ అండ దొరకకపోయినా.. కేవలం ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల అనుభవంతోనే టైటిల్స్‌ను కొల్లగొట్టడం చెన్నై స్పెషాలిటీ..! మరీ ముఖ్యంగా కూల్ కెప్టెన్ మహేంద్రుడి మాయాజాలం.. చెన్నైకి కొండంత అండ. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్సే హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా మూడు విషయాలు ఆ జట్టుదే టైటిల్ అంటున్నాయి. అవి ఏంటో ఓ లుక్కెద్దాం.

కోర్ టీమ్ చెదరలేదు..

కోర్ టీమ్ చెదరలేదు..

కొత్త జట్ల రాకతో మెగా వేలం అనివార్యమవ్వగా.. అన్ని జట్లు ఆటగాళ్లు చెల్లా చెదురయ్యారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తమ పాత జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసింది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన ఫైనల్ జట్టులో కేవలం ముగ్గురు ఆటగాళ్లు (ఫాఫ్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజెల్ వుడ్) మాత్రమే మిస్సయ్యారు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటైన్ చేసుకున్న ఆ జట్టు.. దీపక్ చాహర్, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడులను తిరిగికొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్లంతా గత కొన్నేళ్లుగా జట్టుతో కలిసి ఉండటంతో టీమ్‌కు అడ్వాంటేజ్‌ అవ్వనుంది. ఇతర ఫ్రాంచైజీల మాదిరి ఆటగాళ్లను తమకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సిన పని సీఎస్‌కే‌కు లేదు. మిగిలిన స్థానాల్లో సరైన ఆటగాళ్లను ఆడిస్తే సరిపోతుంది.

ఇద్దరు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్..

ఇద్దరు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్..

టీ20 ఫార్మాట్‌లో క్షణాల్లో మ్యాచ్ మూమెంట్ మారుతుంది. ఇలా ఆటను మార్చే సత్తా కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉండటం ఈ ఫార్మాట్‌లో చాలా ముఖ్యం. అయితే ప్రతీ జట్టులో ఒక్క ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఉంటే.. చెన్నైలో మాత్రం ఇద్దరున్నారు. ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్లే కావడం జట్టుకు కలిసొచ్చే అంశం. అందులో ఒకరైన రవీంద్ర జడేజా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో ఇటీవల జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అజేయ సెంచరీతో పాటు 9 వికెట్లతో సత్తా చాటాడు. గతేడాది కూడా జడేజా ఐపీఎల్‌లో దంచి కొట్టాడు. ఆర్‌సీబీకి చెందిన హర్షల్ పటేల్‌ బౌలింగ్‌లో అతని చూపెట్టిన విధ్వంసం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇక మొయిన్ అలీ సైతం డేంజరస్ బ్యాట్స్‌మన్. తుఫానులా ఉన్నంత సేపు చెలరేగగలడు. గత సీజన్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన మొయిన్ అలీ దుమ్మురేపాడు. బంతితో కూడా రాణించగలడు. ఈ ఇద్దరు సీఎస్‌కేకు కీలకం కానున్నారు.

ఒత్తిడిలో ఆడటం సీఎస్‌కే స్పెషాలిటీ..

ఒత్తిడిలో ఆడటం సీఎస్‌కే స్పెషాలిటీ..

అన్నిటికంటే చెన్నై టీమ్‌కు ఉన్న సూపర్ స్పెషాలిటీ ఒత్తిడిలో ఆడటం. అంతేకాకుండా ఒకరు విఫలమైనా మరొకరు నిలబడటం. గత సీజన్‌లో ఈ రెండు అంశాలే ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. సీజన్ మొత్తం దారుణంగా విఫలమైన వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప.. కోల్‌కతాతో కీలక ఫైనల్లో దుమ్మురేపాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో చెన్నైకి భారీ స్కోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్1లో ఓటమి అంచున చేరిన జట్టును కెప్టెన్ ధోనీ గట్టెక్కించాడు. లీగ్ మొత్తం విఫలమైన అతను.. ఆ మ్యాచ్‌ ఉత్కంఠపరిస్థితుల్లో 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి అద్భుత విజయాన్నందించాడు.

కేకేఆర్‌తో షురూ..

కేకేఆర్‌తో షురూ..

ఈ మూడు విషయాలు చెన్నై జట్టే చాంపియన్ అంటంటే.. ఓ రెండు విషయాలు మాత్రం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతున్నాయి. అవి ఏంటంటే దీపక్ చాహర్ గాయం, ఫాఫ్ డుప్లెసిస్ లేకపోవడం. రూ.14 కోట్ల భారీ ధరకు తీసుకున్న చాహర్ తొడ కండరాల గాయం బారిన పడటం ఆ జట్టుకు తీరని నష్టం చేయనుంది. అతను సీజన్‌లోని సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. చాహర్ గైర్హాజరీతో చెన్నై.. యువ పేసర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక డుప్లెసిస్‌కు రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్న డేవాన్ కాన్వే ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్ 2022 సీజన్‌ టైటిల్ వేటను కేకేఆర్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో చెన్నై మొదలుపెట్టనుంది. గ్రూప్‌బిలో ఉన్న చెన్నై.. సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. మిగతా గ్రూప్‌లోని టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడనుంది.

Story first published: Friday, March 11, 2022, 16:28 [IST]
Other articles published on Mar 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+