IPL 2022: పంజాబ్ కింగ్స్ X కోల్‌కతా హై ఓల్టేజ్ ఫైట్.. ఆ మూడు మ్యాచ్‌లు మాత్రం స్పెషల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరగనున్న 8వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పేపర్‌పై ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. దీంతో మరో హోరా హోరీ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన కేకేఆర్.. బుధవారం ఆర్‌సీబీతో ఉత్కంఠభరితంగా జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఓటమి చవిచూసింది. పంజాబ్ కింగ్స్ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ యూనిట్‌కు సవాల్ విసరాలంటే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ బ్యాటర్లు విదిల్చాల్సిందే.

పంజాబ్ X కేకేఆర్ మ్యాచ్ అంటేనే..
ఇక ఆర్‌సీబీతో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో 205పరుగుల భారీ టార్గెట్ ఛేదించిన పంజాబ్ కింగ్స్.. రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఇరు జట్ల వైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే స్టార్లు ఉండడంతో మరో థ్రిల్లింగ్ గేమ్ అభిమానులను కనువిందు చేయవచ్చు. ఇక పంజాబ్ X కేకేఆర్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ హై ఓల్టేజ్ తలపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఓ మూడు మ్యాచ్‌లు చరిత్రలో నిలిచిపోయాయి. వాటిపై ఓ లుక్కెద్దాం.

ఐపీఎల్-2012 ( 2 పరుగులతో పంజాబ్ విజయం)
2012 సీజన్లో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై పీయూష్ చావ్లా చెలరేగిపోయాడు. మూడు కీలక వికెట్లు తీసి మిడిలార్డర్‌ను దెబ్బతీయడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుత పంజాబ్ కింగ్స్) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో KKR మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 19పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో పంజాబ్ 134పరుగులే చేయగలిగింది. ఛేదనకు దిగిన KKR ఒక దశలో 2వికెట్లు కోల్పోయి 71పరుగులతో గెలుపు దిశగా సాగుతోంది. ఆ సమయంలో దిగిన పీయూష్ చావ్లా తన బౌలింగ్ మాయాజాలంతో మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశాడు.

ఐపీఎల్-2020( 2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం)
కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ ఇది. ఐపీఎల్ 2020 సీజన్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెరుపు హాఫ్ సెంచరీతో శుభ్‌మన్ గిల్ కోల్‌కతాకు శుభారంభాన్నిచ్చాడు. కానీ మిడిలార్డర్ మాత్రం నిరాశపరిచింది. చివర్లో బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ 29 బంతుల్లో 58 పరుగులు చేయడంతో కోల్‌కతా 6వికెట్లు కోల్పోయి 164పరుగులు చేసింది.
తర్వాత ఛేజింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ జోడీ విధ్వంసానికి పంజాబ్ 14.2 ఓవర్లకే 115 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ విజయం లాంఛనమని అంతా భావించారు. కానీ కేకేఆర్ బౌలర్లు ప్రసీద్ కృష్ణ, సునీల్ నరైన్ బౌలింగ్ ధాటికి పంజాబ్ మిడిలార్డర్ కుప్పకూలింది. మంచి శుభారంభం దక్కినా.. పంజాబ్‌కు 2పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు.

ఐపీఎల్ 2015( వికెట్ తేడాతో కేకేఆర్ గెలుపు)
2015 సీజన్‌లో అభిమానులంతా మునివేళ్లపై నిల్చునేలా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. మరో బంతి మిగిలి ఉండగా పంజాబ్ కింగ్స్‌పై వికెట్ తేడాతో గెలుపొందింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఇలా వికెట్ తేడాతో గెలిచిన జట్టుగా కేకేఆర్ గుర్తింపు పొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో 183పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 69 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు బరిలో దిగిన ఆండ్రీ రస్సెల్ వీరవిహారం చేశాడు. కేవలం 21బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 51పరుగులు చేశాడు. అతను ఔటైనప్పటికీ అప్పటికే పంజాబ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోల్‌కతా వైపు మ్యాచ్ టర్న్ అయింది. చివర్లో ఒక్క వికెట్‌తో కేకేఆర్ గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications