
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చింది. అతన్ని వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. సాహాతో సన్నిహితంగా ఉన్నవారు కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. దాంతో నేడు ముంబై ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా కరోనా కమ్మేసింది. ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాంతో ఆ జట్టు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లింది. ఇప్పటికే కేకేఆర్, చెన్నై జట్లు క్వారంటైన్‌లోకి వెళ్లగా.. వాటికి ఢిల్లీ, హైదరాబాద్ జతయ్యాయి. దాంతో లీగ్‌ను కొని రోజుల పాటు వాయిదా వేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే.. లీగ్ రద్దయ్యే అవకాశం ఉంది.