
ఏప్రిల్ 11న తొలి మ్యాచ్
ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వరుసగా నాలుగు టెస్టుల, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ ఫిబ్రవరి 5న మొదలై.. మార్చి 28తో ముగుస్తుంది. ఈ సిరీస్ ముగిసిన 13 రోజుల తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను బీసీసీఐ ప్రారంభించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏప్రిల్ 11న తొలి మ్యాచ్, జూన్ 6న ఫైనల్ మ్యాచ్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఐపీఎల్ 2021 షెడ్యూల్ అధికారికంగా విడుదలకానుంది.

మళ్లీ ఐపీఎల్ బయో-బబుల్‌లోకి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తాన్ని యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి భారత్ గడ్డపైనే ఐపీఎల్ 2021 సీజన్‌ని నిర్వహించబోతున్నారు. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత వారం రోజుల పాటు భారత ఆటగాళ్లకి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఆ తర్వాత ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ బయో-బబుల్‌లోకి వచ్చి ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. విదేశీ క్రికెటర్లు కూడా భారత్‌కి వచ్చి ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఐపీఎల్ టోర్నీకి ముందు ఆటగాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించే దిశగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

ప్రత్యామ్నాయ వేదిక ఆలోచనే లేదు
ఐపీఎల్-2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఈ సారి కచ్చితంగా భారత్‌లోనే నిర్వహించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 'ఐపీఎల్ ఎక్కడ జరపాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. భారత్‌లో నిర్వహించగల వనరులు మాకు ఉన్నాయని నమ్ముతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ వేదిక అనే ఆలోచనే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈ కంటే భారత్‌లోనే పరిస్థితులు బాగున్నాయి. ఇదే కొనసాగి ఇక్కడే ఐపీఎల్ జరగాలని కోరుకుందాం' అని అన్నారు.
India vs England: హర్భజన్ రికార్డ్‌పై కన్నేసిన అశ్విన్.. మరో 12 వికెట్లు తీస్తే!!


Click it and Unblock the Notifications
