
ఏప్రిల్ 10 తర్వాత కొత్త ఎడిషన్
సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు సంబందించిన షెడ్యూల్ అధికారికంగా ఇంకా వెలుబడలేదు. కానీ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐపీఎల్ 2021 జరగనుందని సమాచారం. ఐపీఎల్ 2019 మార్చి 23న ప్రారంభమైంది. రెండు నెలల ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఐపీఎల్ 2021 దాదాపు 2 వారాలు ఆలస్యం అవనుంది. ఇంగ్లీష్ పర్యటన అనంతరం ఆటగాళ్లు చిన్న విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్యలోఫ్రాంఛైజీలు కూడా తమ స్టార్ ఆటగాళ్లతో స్పాన్సర్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తి చేయనున్నాయి. దీంతో ఏప్రిల్ 10 తర్వాత కొత్త ఎడిషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత్‌కే తొలి ప్రాధాన్యత
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. అయితే స్వదేశంలో ఐపీఎల్ నిర్వహణ ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ విజయవంతం కావడంపై ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి విరామం తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న తొలి దేశవాళీ టోర్నీ ఇదే. ఆరు నగరాల్లో బబుల్ నిబంధనలతో నిర్వహిస్తున్న ఈ టోర్నీ.. సజావుగా సాగితే ఐపీఎల్ 2021కు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఏదైనా అటుఇటు జరిగితే మళ్లీ యూఏఈకే ఐపీఎల్ వెళుతుంది. ముస్తాక్ అలీ టోర్నీ తర్వాత ఐపీఎల్ 14వ సీజన్‌ను ఎలా, ఎక్కడ నిర్వహించాలనేదానిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 11న వేలం
ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11న జరిగే అవకాశం ఉంది. జనవరి 20లోగా ఫ్రాంఛైజీలు తాము వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టడంతో పాటు జట్ల మధ్య ఆటగాళ్ల (తమకు కావాల్సిన) బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐపీఎల్ పాలకమండలి ఫ్రాంఛైజీలకు సూచించినట్లు తెలిసింది. అయితే వేలం జరిగే వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండు కొత్త ఐపీఎల్ జట్ల కోసం బీసీసీఐ వచ్చే ఏప్రిల్‌లో టెండర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022లో కొత్త జట్లను చేర్చనున్నట్లు బీసీసీఐ గత నెలలో ప్రకటించింది.

చెన్నై వద్ద కేవలం రూ.15 లక్షలు మాత్రమే
ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు నిర్దేశించిన బడ్జెట్‌లో ఎలాంటి పెంపుదల లేదని ఐపీఎల్ పాలకమండలి ఫ్రాంఛైజీలకు స్పష్టం చేసింది. ఐపీఎల్‌లోని ప్రతి టీమ్‌కి గరిష్ఠంగా ఆటగాళ్ల కోసం రూ.85 కోట్లు ఖర్చు పెట్టే సౌలభ్యం ఉండగా.. ఐపీఎల్ 2020 సీజన్ వేలం తర్వాత చెన్నై వద్ద కేవలం రూ.15 లక్షలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి ముందు కేదార్ జాదవ్ (రూ. 7.8 కోట్లు), పీయూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు)లను విడిచి పెట్టేయాలని చెన్నై నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆలా అయితే చెన్నై సుమారు రూ.14.7 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి రానుంది.

సన్‌రైజర్స్ వద్ద రూ. 10.1 కోట్లు
ఇక రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 14.75 కోట్లు ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 10.1 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ. 8.5 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 6.4 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఎక్కువ మంది ఆటగాళ్లని అట్టిపెట్టుకునేలా ఉంది. ఆ జట్టు వద్ద రూ. 1.95 కోట్లు ఉన్నాయి. కింగ్స్ పంజాబ్ వద్ద కూడా మోస్తరు డబ్బు ఉంది.
Sydney Test: ముగిసిన రెండో రోజు ఆట.. మెరిసిన జడేజా.. ఆస్ట్రేలియా ఆలౌట్!! దీటుగా బదులిస్తున్న భారత్!


Click it and Unblock the Notifications












