SRH vs PBKS: వార్నర్ ఎందుకురా? వారి.. సన్‌రైజర్స్ తుది జట్టుపై పేలుతున్న సెటైర్లు!

షార్జా: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగగా.. పంజాబ్ జట్టు మాత్రం కీలక మార్పులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి తీసుకున్న పంజాబ్ మరో అరంగేట్ర ప్లేయర్ నాథన్ ఎల్లిస్‌కు అవకాశం ఇచ్చింది. రవి బిష్ణోయ్ సైతం జట్టులోకి వచ్చాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్పులు చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను ఆగం చేసిన టీమ్.. ఇంకేం సాధిద్దామని అదే జట్టుతో బరిలోకి దిగారని మండిపడుతున్నారు. కనీసం ఇతరులకైనా అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
వార్నర్ ఎందుకురా?
గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చారని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. వార్నర్ వల్ల ఉపయోగం లేదని, అతను జట్టుకు భారంగా మారాడని కామెంట్ చేస్తున్నారు. అతని స్థానంలో జాసన్ రాయ్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వార్నర్ కన్నా జాసన్ రాయ్ మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో వార్నర్ దారుణంగా విఫలమయ్యాడని అతన్ని పక్కన పెట్టాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. ఇప్పటికే మార్చి మార్చి బరిలోకి దిగారని, మార్పులు చేయడానికి ఏం లేదని కామెంట్ చేస్తున్నారు.
మరిచిపోవద్దు బ్రదర్స్..
అయితే వార్నర్‌ను ట్రోల్స్ చేస్తున్నవారికి అతని అభిమానులు గట్టిగా సమాధానమిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ అందించింది వార్నర్ అనే విషయం మరిచిపోవద్దని, గత కొన్ని సీజన్లుగా జట్టుకు అతను చేసినదాన్ని మరిచి ఇలా విమర్శించడం మంచిది కాదంటున్నారు. ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రానా అతన్ని పక్కనపెట్టాల్సిన పనిలేదంటున్నారు. ఇక జాసన్ హోల్డర్ స్థానంలో అభిషేక్‌కు తీసుకోవాల్సిందని, అసలు కేదార్ జాదవ్‌కు మళ్లీ అవకాశం ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్(కెప్టెన్), మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్,
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, నాథన్ ఎల్లిస్, రవిబిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications