For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: కెప్టెన్‌గా పంత్ or శ్రేయస్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం!!

IPL 2021: Who Will Be The Captain Rishabh Pant Or shreyas Iyer DC Management Yet To Decide
Rishabh Pant or Shreyas Iyer? Delhi Capitals yet to ink on captain for 2nd phase of IPL 2021

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భుజ గాయంతో భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ అతను ఆడనున్నాడు. స్వదేశంలో గత మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా శ్రేయస్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ ఆపే క్రమంలో అతను గాయపడ్డాడు.

సందిగ్ధంలో ఢిల్లీ మేనేజ్మెంట్

సందిగ్ధంలో ఢిల్లీ మేనేజ్మెంట్

ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేదాడి జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్‌కు అప్పగించాలా అని ఆలోచన చేస్తుందట.

ఈ విషయాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. 'కెప్టెన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రిషబ్ పంత్ లేదా శ్రేయస్ అయ్యర్.. ఇద్దరిలో ఎవరికీ కెప్టెన్సీ ఇవ్వాలనేదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని ఢిల్లీ మేనేజ్మెంట్ అధికారి ఒకరు చెప్పారు.

 కెప్టెన్సీ గురించి ఆలోచించట్లేదు

కెప్టెన్సీ గురించి ఆలోచించట్లేదు

ఇటీవల శ్రేయస్‌ అయ్యర్ ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ... 'నా భుజ గాయం పూర్తిగా నయమైంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాదించేందుకు చాలా కష్టపడ్డాను. ఐపీఎల్‌ 2021కు చాలా సమయం ఉంది. టోర్నీలో ఆడేందుకు వేచిచూస్తున్నా. అయితే నేను ఆడినప్పుడు కెప్టెన్సీ చేస్తానా లేదా అనే విషయం నాకు తెలియదు. అది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడుతోంది. పట్టికలో టాప్‌లో నిలిచింది. నాకు అదే ముఖ్యం. నా లక్ష్యం మేం కప్పు సాధించడమే' అని అన్నాడు.

India vs England: లార్డ్స్‌ టెస్టు విజయం.. అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఎంజాయ్!!

అగ్రస్థానంలో ఢిల్లీ

అగ్రస్థానంలో ఢిల్లీ

ఐపీఎల్ 14వ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా రాణించింది. లీగ్ వాయిదాపడే సమయానికి పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 8 మ్యాచుల్లో ఢిల్లీ 6 విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను కాదని శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

అయితే శ్రేయాస్ తిరిగి వచ్చినా పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం తెలుస్తోంది. ఇక అయ్యర్ స్థానంలో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్మిత్ కూడా ఐపీఎల్ రెండో దశ ఆడనున్నాడు.

త్వరలోనే యూఏఈకి ఢిల్లీ

త్వరలోనే యూఏఈకి ఢిల్లీ

యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం ఉదయం యూఏఈకి బయలుదేరుతుంది. దేశీయ ఆటగాళ్లు మరియు అధికారులతో ఢిల్లీ నుండి బృందం బయలుదేరుతుంది. దేశ రాజధానిలో దేశీయ ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు.

యూఏఈ చేరుకున్న తర్వాత కూడా మరోవారం క్వారంటైన్‌లో ఉండనున్నారు. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే యూఏఈకకి చేరుకొని ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకోనున్నారు.

Story first published: Thursday, August 19, 2021, 14:09 [IST]
Other articles published on Aug 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+