For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: లార్డ్స్‌ టెస్టు విజయం.. అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఎంజాయ్!!

India vs England: Virat Kohli enjoys lunch date with Anushka Sharma at London

లండన్: ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటిన భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయం తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మ్యాచ్‌ గెలిచినప్పటి నుంచి మొదలైన సంబరాలను.. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, భార్య అనుష్క శర్మతో కలిసి డేట్‌కు వెళ్లిన కోహ్లీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అనుష్క శర్మతో ఎంజాయ్

లండన్‌లోని టెండ్రిల్‌ రెస్టారెంట్‌కు వెళ్లిన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు అక్కడ తమకు ఇష్టమైన ఆహారాన్ని భుజించారు. కరోనా నిబంధలను పాటిస్తూనే.. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. అనంతం తాము నచ్చే విధంగా మీల్స్‌ తయారు చేసినందుకు కృతజ్ఞతగా చెఫ్‌తో కలిసి ఒక ఫోటో దిగారు. ఈ విషయాన్ని టెండ్రిల్‌ రెస్టారెంట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'ఈరోజు మా రెస్టారెంట్‌కు కోహ్లీ, అనుష్కలు లంచ్‌కు వచ్చారు. వారికి నచ్చే విధంగా మీల్స్‌ తయారు చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. మేం చాలా ఎంజాయ్‌ చేశాం' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

కెప్టెన్‌గా సూపర్ సక్సెస్‌

కెప్టెన్‌గా సూపర్ సక్సెస్‌

విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం సూపర్ సక్సెస్‌ అయ్యాడు. భారత ఆటగాళ్లను పదేపదే ఉత్సహపరుస్తూ.. వారిలో స్ఫూర్తి నింపాడు. ముఖ్యంగా రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో. ఇంగ్లీష్ ఆటగాళ్లు దూషణకు దిగినా.. వాటిని తనదైన శైలిలో తిప్పికొట్టాడు. ఇక రెండు టెస్టులు కలిపి 0, 42, 20 పరుగులు చేశాడు కోహ్లీ. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ విరాట్ ఆడలేదు. వరణుడి కారణంగా ఆ మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు టీమిండియాకు వారం రోజులు గ్యాప్‌ ఉండడంతో క్రికెటర్లు ఉన్న సమయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు జరగనుంది.

Virat Kohli నోరు తెరిస్తే బూతు మాటలే.. నిక్‌ కాంప్టన్‌పై మండిపడుతున్న భారత అభిమానులు!!

అదే జట్టుతో భారత్

అదే జట్టుతో భారత్

లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలూతప్పకపోవచ్చు. బౌలింగ్ విభాగంలోనూ భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. బుమ్రా, షమీ, సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నారు.

మార్పులతో ఇంగ్లండ్

మార్పులతో ఇంగ్లండ్

మరోవైపు మూడో టెస్టు కోసం టీ20 స్పెసలిస్ట్ డేవిడ్​ మలాన్​ను ఇంగ్లండ్ జట్టులోకి తీసుకుంది. టాప్​ ఆర్డర్ బ్యాట్స్​మన్​ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్​కు ఆహ్వానం అందింది. అలాగే బ్యాట్స్​మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్​ లీచ్​ పేరును కూడా స్క్వాడ్​లో ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. ఇక సీమర్‌ సాకిబ్‌ మహమూద్‌కూ చోటు కల్పించారు.

Story first published: Thursday, August 19, 2021, 12:41 [IST]
Other articles published on Aug 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+