IPL 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్ రాత మారెనా? ప్లే ఆఫ్ చేరాలంటే మోర్గాన్ సేనకు అదొక్కటే మార్గం!

హైదరాబాద్: భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 ఎడిషన్ కరోనా వైరస్ దెబ్బకు మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయానికి టాప్ లెవెల్ పెర్ఫామెన్స్‌లు ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టేబుల్లో వరుసగా టాప్-3లో నిలిచాయి. ఫస్ట్ ఫేజ్‌లో ఢిల్లీ మినహా.. ఇతర జట్ల ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే, కరోనా పుణ్యమాని అనుకోకుండా వచ్చిన బ్రేక్ వల్ల తమ తప్పులు సరి చేసుకునేందుకు అన్ని జట్లకు ఓ గోల్డెన్ చాన్స్ దొరికింది. ప్రస్తుతం టేబుల్లో అట్టడుగున ఉన్న జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఇంకా దారి కనిపిస్తోంది. ఈ నెల19వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలి దశలో చెత్తాటతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

ఒత్తిడిలో నైట్‌రైడర్స్..
ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్.. యూఏఈ లెగ్‌లో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో ఏడు మ్యాచ్‌లాడి రెండు గెలిచిన నైట్‌రైడర్స్ ప్రస్తుతం టేబుల్లో ఏడో స్థానంలో ఉంది. ఆ రెండు కూడా బలహీనమైన సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌పైనే గెలుపొందింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిచి తీరడం వారికి అత్యవసరం. టాప్ టీ20 ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. తుది జట్టు ఎంపికలో తప్పు చేయడం ఫస్ట్ ఫేజ్‌లో కోల్‌కతాను బాగా దెబ్బతీసింది. షకీబల్ హసన్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గుసన్, టిమ్ సీఫర్ట్ వంటి ఫారినర్లు అందుబాటులో ఉన్నా మోర్గాన్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు

రస్సెల్ మినహా..
ఇక, యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠితో కూడిన టాపార్డర్ తొలి ఫేజ్‌లో మంచి ఆరంభాలు ఇవ్వలేకపోయారు. టాపార్డర్ అనుభవలేమి వల్ల బ్యాటింగ్ అంశంలో సెకండ్ ఫేజ్‌లోనూ కెప్టెన్ మోర్గాన్‌పై ఒత్తిడి ఉండనుంది. ఆండ్రీ రస్సెల్ మినహా సరైన ఫినిషర్ జట్టులో లేకపోగా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ సేవలు కోల్పోవడం ఈ సారి పెద్ద మైనస్. కమిన్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా టిమ్ సౌథీ(న్యూజిలాండ్)ని తీసుకున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యంగ్ పేసర్ ప్రసిధ్ కృష్ణపై కాస్త అంచనాలున్నాయి. అబుదాబి వేదికగా బెంగళూరుతో వచ్చే సోమవారం జరిగే పోరుతో కోల్‌కతా తమ రెండో ఫేజ్‌ను ప్రారంభించనుంది.

ఆ నలుగురే..
ఫస్టాఫ్‌లో కోల్‌కతా బ్యాటింగ్ విభాగంలో రాణించింది నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి మాత్రమే. 7 ఇన్నింగ్స్‌ల్లో రాణా రెండు హాఫ్ సెంచరీలతో 207 రన్స్ చేయగా.. త్రిపాఠి 7 ఇన్నింగ్స్‌ల్లో 187 రన్స్ చేశాడు. కేకేఆర్ తరఫున ఈ ఇద్దరే హయ్యెస్ట్ స్కోరర్‌లు. ఇక బౌలింగ్‌లో ప్యాటి కమిన్స్ 9 వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ 8 వికెట్లు పడగొట్టాడు. ఇక యూఏఈ గడ్డపై వీరు ఎలా రాణిస్తారో చూడాలి. గత సీజన్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ రస్సెల్ దారుణంగా విఫలమయ్యాడు. మరీ ఈ సీజన్‌లోనైనా దుబాయ్ గడ్డపై చెలరేగుతాడో లేడో చూడాలి.

కేకేఆర్ షెడ్యూల్
| మ్యాచ్ వివరాలుమ్యాచ్ వివరాలు | తేదీ | టైమ్ | వేదిక |
| కోల్‌కతా X ఆర్‌సీబీ | సెప్టెంబర్ 20 | రాత్రి 7.30 | అబుదాబి |
| కోల్‌కతా X ముంబై | సెప్టెంబర్ 23 | రాత్రి 7.30 | అబుదాబి |
| కోల్‌కతా X చెన్నై | సెప్టెంబర్ 26 | సాయంత్రం 3.30 | అబుదాబి |
| కోల్‌కతా X ఢిల్లీ | కోల్‌కతా X ఢిల్లీ | సాయంత్రం 3.30 | షార్జా |
| కోల్‌కతా X పంజాబ్ | అక్టోబర్ 1 | రాత్రి 7.30 | దుబాయ్ |
| కోల్‌కతా X హైదరాబాద్ | అక్టోబర్ 3 | రాత్రి 7.30 | దుబాయ్ |
| కోల్‌కతా X రాజస్థాన్ | అక్టోబర్ 7 | రాత్రి 7.30 | షార్జా |

కేకేఆర్ బెస్ట్ ఎలెవన్
వ్యక్తిగత కారణాలతో ప్యాట్ కమిన్స్ తప్పుకోవడంతో టీమ్ సౌథీ జట్టులోకి వచ్చాడు. ఇక ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా లేదా సునీల్ నరైన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ బరిలోకి దిగనున్నారు. ఫించ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు జట్టులో చోటు దక్కనుంది. ప్రసిధ్ కృష్ణ, టీమ్ సౌథీ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. మిస్టర్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ చోటుకు డోకా లేకపోగా.., శివమ్ మావీ లేదా కమలేశ్ నాగర్‌కోటీ ఇద్దరిలో ఒకరికి మూడో పేసర్‌గా అవకాశం దక్కనుంది. అయితే నరైన్ తుది జట్టులోకి వస్తే షకీబ్ బెంచ్‌పై కూర్చోనున్నాడు.

కేకేఆర్ తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్/ నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, ప్రసిధ్ కృష్ణ, టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ

కేకేఆర్ ఫుల్ స్క్వాడ్:
ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, కమలేశ్ నాగర్ కోటీ, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీశ్ రాణా, ప్రసిధ్ కృష్ణ, గుర్‌క్రీత్ సింగ్, సందీప్ వారియర్, శివం మావి, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తీ, పవన్ నేగి, టీమ్ సీఫెర్ట్, షకీబ్ అల్ హసన్, షెల్డన్ జాక్సన్, వైభవ్ ఆరోరా, కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్, బెన్ కట్టింగ్, వెంకటేశ్ అయ్యర్, టీమ్ సౌథీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications