ఐపీఎల్‌కు ‘వివో’ గుడ్‌బై.. రేసులో ఆ రెండు కంపెనీలు!

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ కంపెనీ వివో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఉన్న బంధాన్ని తెంచుకునేందుకు సిద్దమవుతోంది. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కింద సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించే విధంగా వివో ఐదేళ్లు(2022 వరకు) కాంట్రాక్టు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11
దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇందుకోసం డ్రీమ్ 11 బోర్డుకు రూ.222 కోట్లు చెల్లించింది. మరోపక్క ఇరుదేశాల మధ్య ఇప్పటికీ అదే పరిస్థితులు ఉండడంలో లీగ్‌తో కొనసాగడం సరికాదని వివో భావిస్తోంది. దీంతో హక్కులను బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు డ్రీమ్ 11, అన్ అకాడమీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. మరికొన్ని సంస్థలు కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్నర్ హక్కుల కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.

వివోతో కటీఫ్
ఎవరికి రైట్స్ అప్పజెప్పాలన్నా బీసీసీఐ ఆమోదం మాత్రం తప్పనిసరి. కాగా వివో తమ దగ్గరున్న రైట్స్‌ను ఎవరికి బదిలీ చేసినా బోర్డుకు చెల్లించాల్సిన డబ్బు తగ్గదని, కాస్త పెరిగే అవకాశం కూడా ఉందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. 'బోర్డుతో పరస్పర అంగీకారం ద్వారా వివో ఐపిఎల్ టైటిల్ స్పానర్‌షిప్ ఒప్పందం నుంచి నిష్క్రమించటం దాదాపు ఖరారైంది. గతేడాది మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వివో దగ్గరున్న రైట్స్‌ను ఎవరికైనా బదిలీ చేయాలంటే దానికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సిందే.'అని సదరు అధికారి మీడియాకు తెలిపారు.

ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021
కరోనా కారణంగా గతేడాది యూఏఈకి తరలిన ఐపీఎల్.. ఈ సారి మాత్రం భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సీజన్ షెడ్యూల్‌పై బోర్డు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ జరగనుందని సమాచారం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు మార్చి 28న ముగుస్తాయి. ఈ సిరీస్‌లు ముగిసిన 13 రోజుల తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌ను ప్రారంభించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న తొలి మ్యాచ్, జూన్ 6న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాతే ఐపీఎల్ 2021 షెడ్యూల్ అధికారికంగా విడుదలకానుంది.

వేలంలో 1097 మంది..
ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1097 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి అత్యధికంగా 56 ఎంట్రీలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా తమ జట్టులోకి 25 మంది ఆటగాళ్లను తీసుకుంటే వేలంలోకి 61 మందిని తీసుకుంటామని ఐపీఎల్ తెలిపింది. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. 18న మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications