న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR: అంత అనుభవం ఉండి ఏం లాభం.. అలానేనా బ్యాటింగ్ చేసేది! స‌న్‌రైజ‌ర్స్ ఓటమి కారణం అతడే: సెహ్వాగ్

IPL 2021: Virender Sehwag fire on Manish Pandey for failed to finish 188 run chase against KKR

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021లో భాగంగా వాంఖడే మైదానంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. కోల్‌కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లి చతికిలబడింది. జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీష్‌‌ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. నిజం చెప్పాలంటే.. ఇన్నింగ్స్ చివర్లో మనీశ్ ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతోనే ఆరెంజ్‌ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సింగిల్స్, డబుల్స్‌కే పరిమితం

సింగిల్స్, డబుల్స్‌కే పరిమితం

హాఫ్ సెంచరీ చేసిన మనీశ్ పాండే.. ఇన్నింగ్స్ చివరలో వేగంగా ఆడలేకపోయాడు. జానీ బెయిర్‌‌స్టో ఔటయ్యే సమయానికి సన్‌రైజర్స్‌ 42 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో), అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో) ధాటిగా ఆడారు. కానీ మనీశ్ మాత్రం ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు. 14వ ఓవర్‌లో ఒక సిక్స్ బాదిన మనీశ్.. ఆ తర్వాత చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ బాధలేదు.

చివరి బంతికి సిక్స్ బాదాడు. ఈ 5-6 ఓవర్లలో అతడు డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. నిజానికి మనీశ్ బౌండరీలు బాదుంటే సన్‌రైజర్స్‌ మ్యాచ్ గెలిచేదే. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా అభిప్రాయపడ్డాడు.

బౌండరీలు కొట్టి ఉండాల్సింది

బౌండరీలు కొట్టి ఉండాల్సింది

వీరేందర్ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'మనీశ్ పాండే ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఓ సిక్స్ కొట్టాడు. అప్పటికే మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన మనీశ్.. చివర్లో బాధ్యత తీసుకుని బౌండరీలు కొట్టి ఉండాల్సింది.

ప్రస్తుతం జట్టులో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నాడు. క్రీజులో కుదురుకున్నాడు, ఒత్తిడిలో ఆడిన అనుభవం కూడా ఉంది. అంత అనుభవం ఉండి ఏం లాభం. ఒకవేళ మనీశ్ హిట్టింగ్ చేసుంటే.. మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదు' అని అన్నాడు.

రెండో వికెట్‌కు 92 పరుగులు

రెండో వికెట్‌కు 92 పరుగులు

భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్ ‌(3), వృద్ధిమాన్‌ సాహా (7) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ‌ తర్వాత గొప్పగా పుంజుకుంది. మనీశ్‌ పాండే, జానీ బెయిర్‌స్టో అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. ఆపై హిట్టర్లు మహ్మద్‌ నబీ (14), విజయ్‌ శంకర్ ‌(11) విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ ‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాదినా.. అప్పటికే ఆసల్యం అయింది. మనీశ్‌ చివరి బంతివరకు క్రీజులో ఉన్నా ఫలితం లేకుండాపోయింది.

SRH vs KKR: కోల్‌క‌తా నైట్‌రైడర్స్ 100వ విజ‌యం.. షారుక్ ‌రియాక్ష‌న్ ఇదీ!!

Story first published: Monday, April 12, 2021, 13:04 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X