For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR: కోల్‌క‌తా నైట్‌రైడర్స్ 100వ విజ‌యం.. షారుక్ ‌రియాక్ష‌న్ ఇదీ!!

SRH vs KKR: Shah Rukh Khan reacts as Kolkata Knight Riders 100th win in IPL

ముంబై: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టు 100వ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఐపీఎల్ 2021 సీజ‌న్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రా‌బాద్‌తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా 10 ప‌రుగులతో గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో నైట్‌రైడర్స్ 100వ విజయాన్ని ఖాతాలో వేడుకుంది. ఈ మైల్‌ స్టోన్ విజ‌యంపై కోల్‌క‌తా టీమ్ కోఓన‌ర్, బాలీవుడ్ 'బాద్ షా' షారుక్‌ ఖాన్ స్పందించారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత అత‌డు ఓ ట్వీట్ చేశాడు. '100వ ఐపీఎల్ మ్యాచ్ గెల‌వ‌డం సంతోషంగా ఉంది. అంద‌రు ప్లేయ‌ర్స్ బాగా ఆడారు' అని పేర్కొన్నారు. ఒక్కో ప్లేయ‌ర్ పేరును షారుక్‌ ప్ర‌త్యేకంగా ట్యాగ్ చేశారు.

ఐపీఎల్‌లో 100 విజ‌యాలు సాధించిన మూడో టీమ్‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టు నిలిచింది. ఈ జాబితాలో ఐదుసార్లు చాంపియ‌న్ అయిన ముంబై ఇండియ‌న్స్ టాప్‌లో ఉంది. ముంబై మొత్తం 204 మ్యాచ్‌లు ఆడి 121 గెలిచింది. మూడుసార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ 106 విజయాలతో రెండో స్థానంలో ఉంది. చెన్నై 180 మ్యాచ్‌లు ఆడి 106 గెలిచి, 74 ఓడిపోయింది. మూడో స్థానంలో కోల్‌క‌తా ఉంది. కోల్‌కతా 90 మ్యాచులలో ఓడి.. 4 మ్యాచులను టైగా ముగించింది. ఇంకో మూడింట్లో ఫలితం రాలేదు.

కోల్‌కతా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ‌గిల్ ‌(15) విఫలమైనా.. రాణా (80; 56 బంతుల్లో 9x4, 4x6), త్రిపాఠి (53; 29 బంతుల్లో 5x4, 2x6) అర్ధ శతకాలతో మెరిశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించారు. అయితే శతక భాగస్వామ్యం వైపు దూసుకుపోతున్న వీరిని నటరాజన్‌ విడదీశాడు. ఆపై వెనువెంటనే మరో మూడు వికెట్లు పడటంతో కోల్‌కతా పరుగుల వేగానికి బ్రేక్‌ పడింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (22; 9 బంతుల్లో 2x4, 1x6) బౌండరీలు బాదడంతో కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్ ‌(3), వృద్ధిమాన్‌ సాహా (7) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ‌ తర్వాత గొప్పగా పుంజుకుంది. మనీశ్‌ పాండే (61; 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5x4, 3x6) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. మహ్మద్‌ నబీ (14), విజయ్‌ శంకర్ ‌(11) విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ ‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాదినా అప్పటికే ఆసల్యం అయింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, April 12, 2021, 12:04 [IST]
Other articles published on Apr 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+