వావ్.. మోర్గాన్‌పై నేను టాస్ గెలవడమా? నమ్మలేకపోతున్నా: విరాట్ కోహ్లీ

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. అయితే కేకేఆర్ సారథి, ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై తాను టాస్ గెలవడం అస్సలు నమ్మలేకపోతున్నాని విరాట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కోహ్లీ వరుసగా 7 సార్లు టాస్ ఓడిపోయాడు. దాంతో తాజా మ్యాచ్‌లో టాస్ గెలవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.
నమ్మలేకపోతున్నా..
'ఇయాన్ మోర్గాన్‌పై టాస్ గెలవడాన్ని నమ్మలేకపోతున్నా. అతనికి నాకు టాస్ ముఖాముఖి 7-1గా మారింది. ఇక పిచ్ గత మ్యాచ్ కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఓవర్‌సీస్ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతున్నాం. క్రిస్టియన్ స్థానంలో రజత్ పటిదార్ వచ్చాడు. స్పిన్‌ను అతను అలవోకగా ఆడగలడు.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
ఫ్యాన్స్ పరేషాన్..
ఇక అభిమానులు కూడా విరాట్ టాస్ గెలవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వావ్ విరాట్ టాస్ గెలిచాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగడంపై కూడా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ మాట వినడానికి చాలా సంతోషంగా ఉందని, విదేశీ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగడం అద్బుతమని కొనియాడుతున్నారు. ఇన్నాళ్లకు విరాట్ టాస్ గెలిచాడని కామెంట్ చేస్తున్నారు.
వరుణ్ దెబ్బ..
బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి లోకల్ బాయ్ వరుణ్ చక్రవర్తీ ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని రాహుల్ త్రిపాఠి సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చిన అతను పటీదార్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి చెలరేగుతున్నాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీని వరుణ్ చక్రవర్తి ఔట్ చేయడంపై కూడా నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమవ్వడంతో ఆ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. దాంతో విరాట్‌ను వరుణ్ ఔట్ చేయడంతో ఫ్యాన్స్ ఫన్నీ మీమ్ ట్రెండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications