Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: చెన్నైకి చేరుకున్న విరాట్ కోహ్లీ.. క్రేజీ ట్వీట్ చేసిన ఆర్‌సీబీ!

IPL 2021: Virat Kohli reaches Chennai to Join RCB squad

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం టీమిండియా కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సారథి విరాట్ కోహ్లీ గురువారం చెన్నైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా తెలియజేసింది. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం విరాట్ ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు.

ఇటీవల ఇంగ్లండ్​తో వన్డే సిరీస్ ముగిసిన​ అనంతరం నేరుగా జట్టుతో కలిసే అవకాశం ఉన్నా.. విరాట్ బబుల్ ధాటి ఇంటికి వెళ్లాడు. స్వల్ప విరామంతో తర్వాత మళ్లీ ఐపీఎల్ కోసం ఆర్‌సీబీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు చేరుకున్నాడు. దాంతో అతను క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది.

ఈ లెక్కన ఏప్రిల్ 9న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో జరిగే సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే విరాట్ జట్టుతో కలవనున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో విరాట్ అదరగొట్టడం ఆర్‌సీబీకి కలిసొచ్చే అంశం.

ఇప్పటికే చెన్నై చేరుకున్న ఆర్‌సీబీ బృందం.. మంగళవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆటగాళ్లందరూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. మరో స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ కూడా గురువారం, జట్టు ఏర్పాటు చేసిన బయో బబుల్​లోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు.

Story first published: Thursday, April 1, 2021, 17:07 [IST]
Other articles published on Apr 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+