మీ రక్షణకు మీరే కెప్టెన్.. జాగ్రత్తగా ఉండి మహమ్మారిని తరిమికొట్టండి: విరాట్ కోహ్లీ

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ నానాటికీ ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెటర్లు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు చేసిన పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సైతం ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌కు ముందు ఈ వీడియోలను ప్లే చేసింది.

మీరే మీకు రక్షణ..
ప్రతీ ఒక్కరు ఓ కెప్టెన్‌లా తమ కుటుంబాలకు రక్షణగా నిలవాలని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రజలను కోరాడు. 'హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్‌గా నేను ముందుండి నడిపిస్తాను. నా చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా నాలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి. మీరు ఆరోగ్యంగా ఉండటంతో మీ కుటుంబంతో పాటు చుట్టు పక్కలవారికి రక్షణగా ఉండండి'అని విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు.

మీరే సూపర్ హీరో
ఈ ఆపత్కాలంలో రక్షించడానికి ఏ సూపర్ హీరో రాడని, ఎవరికి వారే సూపర్ హీరోలా తమ కుటుంబాలను కాపాడుకోవాలని, ఈ వైరస్ నుంచి బయటపడాలని ఏబీ డివిలియర్స్ పిలుపునిచ్చాడు. 'హాయ్.. నేను ఏబీ డివిలియర్స్. ఆపత్కాలంలో సూపర్‌హీరో కోసం ఎదురుచూడలేం. మీరే సూపర్‌హీరోగా మారాలి. మహమ్మారి వేళ ఇంట్లో ఉండటం ద్వారానే సురక్షితంగా ఉండగలం. అత్యవసరమైతే బయటకు వెళ్లవద్దు. వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. భౌతిక దూరంతో పాటు సానిటైజర్స్‌ను వాడండి. అందరం కలిసికట్టుగా దీని నుంచి బయటపడదాం.'అని ఏబీడీ పేర్కొన్నాడు.
కోవిడ్‌ను జయించాలి..
కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడనికి తామున్నామని, అందరూ జాగ్రత్తగా ఉండి కరోనాను జయించాలని మ్యాక్స్‌వెల్ కోరాడు. 'మీకు వినోదం, సంతోషాన్ని ఇవ్వడమే మా ప్రాధాన్యం. బదులుగా, అందరూ జాగ్రత్తగా ఉండి, కొవిడ్‌ను జయించాలని కోరుతున్నా.'అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం భారత్‌లో రికార్డు స్థాయిలో 3,46,786 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications