న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs KKR trolls: ఓడితే ఓడారు కానీ ధోనీ సేనకు చుచ్చు పోయించార్రా!

IPL 2021: Twitter Reactions after CSK beat KKR by 18 runs in a breathless encounter

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఓడినా వీరోచిత పోరాటంతో ఆకట్టుకుంది. 221 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో కేకేఆర్‌ స్కోరు 31/5. ఈ దశలో ప్యాట్ కమిన్స్‌ (34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్‌), ఆండ్రీ రస్సెల్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) అసమాన పోరాటంతో ధోనీ సేనకు ఓటమిని కళ్లముందుంచారు. చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో గట్టెక్కింది. అయితే ఈ మ్యాచ్‌పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కోల్‌కతా ఓడినా చెన్నైకి చుచ్చు పోయించిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్, మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

భలే భయపెట్టార్రా..

అసాధారణ పోరాటం కనబర్చిన ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్, దినేశ్ కార్తీక్‌లను అభిమానులు కొనియాడుతున్నారు. వీరి ముగ్గురి ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. భలే భయపెట్టర్రా.. చెన్నైకి కారిపోయిందనే క్యాప్షన్‌తో మీమ్స్ షేర్ చేస్తున్నారు. సామ్ కరన్ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 2,6,6,6,4,6 నాలుగు భారీ సిక్సర్లతో 30 పరుగులు పిండుకున్నాడు. దీనిపై కూడా నెటిజన్లు చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కమిన్స్ చిన్నపిల్లాడిని ఏడిపించాడని, అతన్ని అరెస్ట్ చేయాలనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. చిన్న పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో కమిన్స్ అరెస్ట్ అయ్యాడని కామెంట్ చేస్తున్నారు.

ఓడినా మనసులు గెలిచారు..

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడినా తమ మనసులను గెలిచిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ సైతం కేకేఆర్‌ను మెచ్చుకున్నాడు. ఈ తరహా ఆటను ముందు ముందు కొనసాగించాలని చెబుతూ.. రస్సెల్, కమిన్స్, దినేశ్ కార్తీలకను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ ముగ్గురు కేకేఆర్ హీరోలని ఆ జట్టు ఫ్రాంచైజీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కేకేఆర్ ఓవర్లన్నీ ఆడుంటే గెలిచేదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కామెంట్ చేశాడు. 19.1 ఓవర్లలో చెన్నై చేసిన స్కోర్ కంటే ఒక పరుగు ఎక్కువగానే కేకేఆర్ చేసిందని ట్వీట్ చేశాడు. 31/5 నుంచి కేకేఆర్ పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు.

దెబ్బతీసిన చాహర్

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్‌ డు ప్లెసిస్‌ (60 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్‌కతాను ఆరంభంలో దీపక్‌ చహర్‌ (4/29) తన పేస్‌తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్‌గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు.

Story first published: Thursday, April 22, 2021, 11:10 [IST]
Other articles published on Apr 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X