ఏమిరా శంకరా.. ఏమిరా ఉపయోగం నీ వల్ల జట్టుకు.. నువ్వేలా ప్రపంచకప్‌కు సెలెక్ట్ అయ్యావురా?

చెన్నై: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దురదృష్టం వెంటాడింది. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును ముంచింది. కేన్ విలియమ్సన్(51 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అద్భుతంగా పోరాడినా సన్ రైజర్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ సీజన్ తొలి సూపర్ ఓవర్ పోరు టీమ్‌కు కలిసి రాలేదు. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో హైదరాబాద్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి నేపథ్యంలో ఆ టీమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన సీనియర్ ప్లేయర్ విజయ్ శంకర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఏమిరా శంకరా..?
ఏమిరా శంకరా..? ఏమిరా ఉపయోగం నీవల్ల హైదరాబాద్ జట్టుకు.. బౌలింగ్‌లో వికెట్లు తీయకపోతివి.. ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోతివి.. క్యాచ్‌లు నేలపాలు చేస్తివి. బ్యాటింగ్ చేయకపోతివి. ఏమిరా శంకరా నీవల్ల జట్టుకు లాభం అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఓడగా.. ఇవన్నీ మిడిలార్డర్ వైఫల్యంతోనే చేజార్చుకుంది. పైగా ఇవన్నీ సులువుగా గెలిచే మ్యాచ్‌లు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకొని ఆడినా.. ఈ రోజు హైదరాబాద్‌లో టాప్‌లో ఉండేదని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారంగా విజయ్ శంకర్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైదరాబాద్ ఆడిన ఐదింటికి ఐదు మ్యాచ్‌ల్లో విజయ్ శంకర్‌కు అవకాశం లభించింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కాస్త బౌలింగ్‌లో పరుగులివ్వకుండా కట్టడి చేసినా.. ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనైతే మరీ ఘోరంగా విఫలమై టీమ్ ఓటమికి కారణమయ్యాడు. వరుసగా 11, 3, 28, 8 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టో, విలియమ్సనే మ్యాచ్ ముగించడంతో విజయ్ శంకర్‌కు బ్యాటింగ్ రాలేదు. లేకుంటే ఈ మ్యాచ్ కూడా సన్‌రైజర్స్ ఓడిపోయేది. ముంబైతో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి, 28 రన్స్ చేసినా.. కీలక పొలార్డ్ క్యాచ్ నేలపాలు చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శంకర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నువ్వేలా సెలెక్ట్ అయ్యావ్‌రా?
అసలు భారత జట్టుకు నువ్వెలా ఎంపికయ్యావురా అంటూ శంకర్‌ను ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు క్రికెటర్ ఎలా అయ్యావురా సామీ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ భారత జట్టులో విజయ్ శంకర్ అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చింది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. త్రీ డైమన్షన్ నేపథ్యంలోనే అతని ఎంపిక చేశామని అప్పట్లో ఎమ్మెస్కే వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై రాయుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిచండంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. ఆ ప్రపంచకప్‌లో విజయ్ శంకర్ గాయంతో మధ్యలోనే తప్పుకోవడం.. నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేక భారత్ ఇంటిదారి పట్టడం జరిగిపోయింది. ఇక శంకర్ విఫలమైనప్పుడల్లా అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంటారు.
ఈ 3డీగాడి కంటే సుచిత్ నయం..
ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన సుచిత్ సన్‌రైజర్స్ జట్టులో ఉన్న భారత ఆటగాళ్ల కంటే ఎంతో నయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లోనే తీవ్ర ఒత్తిడిలో కేన్ మామకు అండగా నిలుస్తూ ఓ ఫోర్, భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. మ్యాచ్ టై అవ్వడానికి కారణం అతనేనని కొనియాడుతున్నారు. విజయ్ శంకర్ కన్నా ఈ సుచిత్ ఎన్నో రెట్లు బెటరని ట్వీట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications