
అన్ని ఒప్పందాల్లో కోత...
ఏప్రిల్ 19న ప్రారంభమైన ఐపీఎల్ 14వ సీజన్.. 29 మ్యాచ్‌ల పాటు నిరాటంకంగా కొనసాగింది. కానీ ఒక్కసారి బబుల్‌ను కరోనా కమ్మేయడంతో అర్థాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది. సగం మ్యాచ్‌లే పూర్తీ అవ్వడంతో అన్ని ఒప్పందాల్లో కోత పడనుంది. 'ఇప్పటివరకు 24 రోజుల క్రికెట్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. ఇంకా సగం మ్యాచ్‌లున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే రూ. 2200 కోట్లు నష్టం రానుంది. ఇందులో బ్రాడ్‌కాస్టర్, స్పాన్సర్షిప్ మనీ ఉంది'అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సగమే చెల్లించనున్న స్టార్..
ఐదేళ్ల కాంట్రాక్ట్ కింద స్టార్.. బీసీసీఐకి రూ. 16,374 కోట్లు చెల్లిస్తుంది. అంటే ఏడాదికి రూ. 3269 కోట్లు. ప్రతి సీజన్‌లో 60 మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి.. ప్రతి మ్యాచ్‌కు సుమారు రూ. 54.5 కోట్లు ఇస్తుంది. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి కాబట్టి .. రూ. 1580 కోట్లు స్టార్ చెల్లిస్తుంది. ఫుల్ టోర్నీ లేదు కాబట్టి మిగతా రూ. 1690 కోట్లు ఇవ్వదు. టైటిల్ స్పాన్సర్షిప్ వివో చెల్లించాల్సిన రూ. 440 కోట్లలో సగం మాత్రమే రావొచ్చు. అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రావాల్సిన రూ. 120 కోట్లు కూడా కష్టమే. వీటన్నింటివల్ల సెంట్రల్ రెవెన్యూ పూల్ మనీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రాంచైజీలకు కూడా భారీగానే నష్టం వాటిల్లనుంది.

ఆటగాళ్లకు 483 కోట్లు..
కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయినా స్టాండర్డ్ ఐపీఎల్ ప్లేయర్స్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు క్రికెటర్లకు పూర్తి వేతనం అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటగాళ్లకు మూడు వాయిదాల్లో వేతనాలు చెల్లిస్తూ ఉంటారు. మొదటి వాయిదా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన రెండు వాయిదాలు ఐపీఎల్ సీజన్ ముగిసే లోపు చెల్లించాల్సి ఉంటుంది. సీజన్ నిరవధిక వాయిదాతో వారి వేతనాలపై సందిగ్ధత నెలకొంది. కానీ ఇన్యూరెన్స్ పాలసీ కింద ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు వేతనాలు చెల్లించనున్నాయి. ఐపీఎల్ సీజన్‌కు ముందే గాయపడిన శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ నిబంధనల మేరకే పూర్తి వేతనం చెల్లించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆటగాళ్లందరికి కలిపి రూ.483 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉన్నది.

ఫ్రాంచైజీల బాధ వర్ణాతీతం..
ఐపీఎల్‌లో రెండు మూడు ఫ్రాంచైజీలు తప్ప మిగతావి అన్ని నష్టాల్లోనే ఉన్నాయి. స్పాన్సర్లు, బీసీసీఐ షేర్, టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకు భారీగానే ఆదాయం వచ్చేది. గత ఏడాది ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగడంతో ఫ్రాంచైజీలకు గేట్ ఆదాయం లేకుండా పోయింది. ఒక్కో మ్యాచ్‌కు దాదాపు రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఒక సీజన్‌లో దాదాపు రూ.30 కోట్లు టికెట్ ఆదాయాన్ని ఫ్రాంచైజీలు పొందేవి. ఇప్పుడు ఆ ఆదాయం లేకుండా పోయింది. మరోవైపు సగం లీగ్ మాత్రమే జరగడంతో బీసీసీఐ నుంచి వచ్చే ఆదాయం కూడా ఆ మేరకు పడిపోనున్నది. మరోవైపు బయో బబుల్ ఏర్పాటు, ఆటగాళ్ల బస, ప్రయాణానికి భారీగా ఖర్చు చేశాయి. పూర్తి లీగ్ జరిగి ఉంటే ఎంతో కొంత ఆదాయం ఫ్రాంచైజీలకు వచ్చి సర్దుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు నష్టాలు భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications












