For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ భారీ సిక్సర్‌కు చిన్నప్పటి రబ్బర్ బాల్ ప్రాక్టీసే కారణం: సూర్యకుమార్ యాదవ్

IPL 2021: Suryakumar Yadav reveals how he managed to perfect his trademark flick shot vs KKR

చెన్నై: ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో‌కి అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాట్స్‌మన్.. తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన సూపర్ ఫామ్‌ను ఐపీఎల్‌లోను కొనసాగిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన సూర్య.. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా కేకేఆర్ స్టార్ పేసర్ ప్యాట్‌ కమిన్స్‌ వేసిన 10వ ఓవర్‌లో సూర్యకుమార్‌ కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

99 మీటర్ల సిక్సర్..

99 మీటర్ల సిక్సర్..

ఆ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్‌ లైన్‌పై గంటకు 135.1 కిమీ వేగంతో కమిన్స్ సంధించగా.. ఆఫ్ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లిన సూర్య డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ అవడంతో.. చాలా ఎత్తులోకి వెళ్లిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. 99 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్సర్ మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులను అలరించింది. ఈ సిక్సర్‌ సాయంతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న అతను ముంబై టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూర్య కొట్టిన ఈ భారీ సిక్సర్‌కు డగౌట్‌లో కూర్చున్న ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వావ్ అంటూ నోరెళ్ల బెట్టాడు.

రబ్బర్ బాల్ ప్రాక్టీస్ మహిమా..

రబ్బర్ బాల్ ప్రాక్టీస్ మహిమా..

మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్‌పై స్పందించిన సూర్య.. అనుకోకుండా ఆ షాట్ ఆడానని తెలిపాడు. చిన్నప్పుడు రబ్బర్ బాల్‌తో బాగా ఆడేవాడినని, ఆ ప్రాక్టీస్ మహిమే ఈ భారీ సిక్సర్ కొట్టేలా చేసిందని చెప్పుకొచ్చాడు. 'నా చిన్నతనంలో నేను రబ్బర్ బాల్‌ క్రికెట్ బాగా ఆడేవాడిని. అది సిమెంట్ ట్రాక్‌పై వన్ సైడ్ బౌండరీ మాత్రమే ఉండేది. అక్కడి నుంచే ఈ 90-95 మీటర్ సిక్సర్ కొట్టడం వచ్చిందనుకుంటా. నా ఆట పట్ల చాలా సంతోషంగా ఉంది. జట్టు కోసం దీన్ని ఇలానే కొనసాగిస్తా. ఇక వికెట్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఆచితూచి ఆడాం.

నా లాంగెస్ట్ సిక్స్ ఇదే..

నా లాంగెస్ట్ సిక్స్ ఇదే..

ఆ సమయంలో నేను కొట్టిన షాట్‌ 99 మీటర్ల ఎత్తుకు వెళ్లిందనే మాట వినబడింది. నాకు తెలిసి నా ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే లాంగెస్ట్‌ సిక్సర్‌. అది కూడా ఇదే జట్టుకు. అత్యంత కీలకమైన సమయంలో, గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ షాట్‌ ఆడటం ప్రత్యేకం. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉండితీరాలి. నాకు తెలిసి 152 మరీ అంత పెద్ద స్కోరేమీ కాదు. మరో 15-20 పరుగులు చేయాల్సింది. డ్యూ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి తరుణంలో మేం విజయం సాధించామంటే ఆ క్రెడిట్‌ అంతా మా బౌలర్లకే దక్కుతుంది. అద్భుతంగా రాణించారు. ఫీల్డర్లు కూడా పూర్తి సహకారం అందించారు. విజయాన్నందుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది'' అని సూర్య సంతోషం వ్యక్తం చేశాడు.

ఓడే మ్యాచ్‌లో గెలిచిన ముంబై..

ఓడే మ్యాచ్‌లో గెలిచిన ముంబై..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైటరైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రాణా(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శుభ్‌మన్ గిల్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33) శుభారంభం అందించినా ఫలితం లేకపోయింది.

Story first published: Wednesday, April 14, 2021, 16:10 [IST]
Other articles published on Apr 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+