IPL 2021: సురేష్ రైనా 3+ రవీంద్ర జడేజా 8 = సీఎస్‌కే 11

ముంబై: మూడు ఐపీఎల్ టైటిళ్లు.. ఐదుసార్లు రన్నరప్! ఇది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ట్రాక్ రికార్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు కూడా. చెన్నై అంతలా విజయవంతం అయ్యిందంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత చిన్న తల సురేష్ రైనా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాది కూడా కీలక పాత్రే. రైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా కొనసాగుతుండగా.. జడేజా అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఇద్దరూ ఎన్నో మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు అద్భుత విజయాలు అందించారు.
ఇద్దరూ కలిసి ప్రాక్టీస్
సురేష్ రైనా గతేడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. దాంతో చాలా కాలంగా అతడు ఆటకు దూరమయ్యాడు. మరోవైపు రవీంద్ర జడేజా గతేడాది ఐపీఎల్‌లో ఆడినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాట్‌తో మెరిసాడు కానీ బంతితో తేలిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడిన జడ్డూ మూడు నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ మధ్యే కోలుకొని ఐపీఎల్ 2021కు సిద్ధమవుతున్నాడు. తాజాగా సీఎస్‌కే శిబిరంలో ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేశారు.

8+3 =11
సురేష్ రైనా, రవీంద్ర జడేజాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని చెన్నై సూపర్ కింగ్స్ సంబరపడింది. 'చిన్నతల.. పెద్దమనసు. 8+3 =11. వీరిద్దరూ చెన్నైని మరో స్థితికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు' అని సీఎస్‌కే ట్వీట్ చేసింది. రైనా సీఎస్‌కే జట్టులో మూడో నంబర్ ఆటగాడు కాగా.. జడేజా 8వ ఆటగాడు. దీంతో వారిద్దరి సంఖ్యలు కలిపి చెన్నై అలా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. చెన్నై అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

రైనా లేని లోటు స్పష్టంగా కనిపించింది
గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో సురేష్ రైనా లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. లీగ్ దశలో ఆదిలోనే వరుస ఓటములతో చెన్నై తడబడింది. చివర్లో విజయాలు సాధించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో టోర్నీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఇక ఇప్పుడు రైనా రాకతో చెన్నై మునుపటి ప్రభావం చూపుతుందేమో చూడాలి. కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీలు కూడా కొండంత అండ. ఆదివారం ముంబై వేదికగా చెన్నై తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది.

భారీ ఎదురుదెబ్బ
14వ సీజన్‌కు ముందు చెన్నైకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆ జట్టు పేసర్, ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ ప్రకటించాడు. పలు సిరీస్‌లు, లీగ్‌ల కోసం 10 నెలలుగా బయోబబుల్‌లోనే ఉంటున్నానని, అందుకే క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నట్టు చెప్పాడు. అలాగే ఈ ఏడాది జరిగే యాషెస్, టీ20 ప్రపంచకప్‌నకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేందుకు ఈ విశ్రాంతి తనకు ఉపయోగపడుతుందని హాజిల్ అన్నాడు.
South Africa vs Pakistan: తప్పు అంతా నాదే.. డీకాక్‌ది కాదు: ఫకర్ జమాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications