Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: నాలుగో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ.. సన్‌రైజర్స్‌కు ఇంకా అవకాశం ఉంది! ఎలాగంటే?!!

IPL 2021: Sunrisers Hyderabad Still Can Qualify For Playoffs By Winning All Matches

హైదరాబాద్: యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)​ 2021 రెండో దశ రసవత్తరంగా మారుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం అన్ని జట్టు ప్రయత్నిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్​ టాప్​-4లో నిలవడం ఖాయం.

ఈ రెండు జట్లకు ఇప్పటికే 16 పాయింట్లు ఉన్నాయి. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి అన్ని జట్లు రేసులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్ బెర్తు కోసం ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

ప్లే ఆఫ్స్‌కు చేరువలో బెంగళూరు

ప్లే ఆఫ్స్‌కు చేరువలో బెంగళూరు

ఐపీఎల్‌ 2021లో ఇప్పటికే ఎనిమిదేసి విజయాలు సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నట్లే. ఇరు జట్లు ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. అంతేకాదు చెన్నై, ఢిల్లీలు టాప్-2లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. టాప్-2లో ఉన్న జట్లకు ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.

10 మ్యాచ్‌లాడి 6 విజయాలు సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరువలోనే ఉంది. మిగతా 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ఆ జట్టు ముందంజ వేస్తుంది. లేదా ఒకటి నెగ్గినా దానికి అవకాశముంటుంది. కాకపోతే మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.

Inzamam-ul-Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ గుండెపోటు.. మూడు రోజుల నుంచి..!!

 ఒక బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ

ఒక బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య పోటీ

ఇక నాలుగో బెర్తు కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్, పంజాబ్‌ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు నాలుగో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నాలుగు జట్లూ 10 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో సమాన స్థితిలో ఉన్నాయి. అందుకే ఈ నాలుగు జట్లకు అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్‌ 2021 రెండో అంచెను బాగానే ఆరంభించినప్పటికీ.. తమ చివరి మ్యాచ్‌ల్లో కోల్‌కతా, రాజస్థాన్‌ ఓటమి పాలై ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. దాంతో రేసు రసవత్తరంగా మారింది. ఇక నుంచి ఈ నాలుగింటిలో గెలిచిన జట్లే ముందుకు వెళ్లనున్నాయి. ఇక్కడ రన్ రేట్ కూడా ముఖ్యమే. మరి ఈ నాలుగు జట్లలో నిలకడగా ఆడి ప్లేఆఫ్స్‌ బెర్తు సాధించే జట్టేదో చూడాలి.

ఓ చిన్న అవకాశం

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సోమవారం రాత్రి రాజస్థాన్‌పై నెగ్గినా.. ఇప్పటికే 8 మ్యాచ్‌ల్లో ఓడటంతో ప్లే ఆఫ్‌ రేసుకు దాదాపు దూరమైంది. అయితే సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ చేరేందుకు ఓ చిన్న అవకాశం మిగిలే ఉంది. ఇక నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆడే ప్రతి మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్‌ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఉన్న నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు ప్రతి జట్టు ఆడాల్సి ఉంటుంది.

అదే సమయంలో సన్‌రైజర్స్‌ జట్టుకు మిగి ఉన్న 4 నాలుగు మ్యాచుల్లో కూడా గెలవాల్సి ఉంటుంది. ఇక్కడ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవడం హైదరాబాద్ జట్టుకు కీలకం. ఇకపై సన్‌రైజర్స్‌ ఒక్క మ్యాచ్ ఓడినా.. అధికారికంగా ప్లే ఆఫ్‌ రేసు నుంచి తప్పుకుంటుంది.

Story first published: Tuesday, September 28, 2021, 11:21 [IST]
Other articles published on Sep 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+