
కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం గుండె పోటుకు గురయ్యారు. దీంతో ఇంజమామ్‌ను హుటాహుటిన లాహోర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఇంజమామ్‌కు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 51 ఏళ్ల పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంజి ఆరోగ్యం బాగుందని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్‌కు గత మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను లాహోర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆయనకు టెస్టులు చేశారు. ఇంజమామ్ గుండెపోటుకు గురైనట్లు పరీక్షల్లో తేలడంతో.. ఆయనకు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్ పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంజీ గుండెపోటుకు గురయ్యారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు.
1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్ ఉల్ హక్.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా మన్ననలు పొందారు. ఇంజమామ్ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచారు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థానీ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక టీ20 మ్యాచ్ ఆడి 11 పరుగులు చేశారు. 2007 లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పీసీబీలో పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు.