Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunrisers Hyderabad: ఆ ఒక్కటి సెట్ అయితే టైటిలే.. జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!

IPL 2021: Sunrisers Hyderabad (SRH) Strength, Weakness, Best Playing 11 and Prediction
IPL 2021: Sunrisers Hyderabad SWOT | వార్నర్‌- బెయిర్‌స్టోల జోడీ ఒక సునామీ, అలాంటోడు Warner ఒక్కడే !

ఆడింది ఏనిమిది సీజన్లు.. ఓసారి చాంపియన్‌షిప్.. ఇంకోసారి రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం... ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్‌లో తేడా ఉండదు.

టీమ్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం ఆరెంజ్ ఆర్మీ స్టైల్.. దాంతో ధనాధన్ లీగ్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్.. నయా సీజన్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరీ ఈసారి ఆరెంజ్ ఆర్మీ తమ సత్తా చూపిస్తుందా? అంచనాలను అందుకుంటుందా.. మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందో? లేదో చూడాలి.!

టైటిలే లక్ష్యంగా..

టైటిలే లక్ష్యంగా..

ఐపీఎల్‌లో అత్యంత నిలకడ రాణిస్తున్న జట్టు సన్‌రైజర్స్‌. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆరంభంలో తడబడినా.. 2015లో డేవిడ్‌ వార్నర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదరగొడుతోంది. 2016 నుంచి 2020 వరకు వరుసగా అయిదేళ్లు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వార్నర్‌ నాయకత్వం.. టామ్‌ మూడీ వ్యూహరచన.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గనిర్దేశనం హైదరాబాద్‌కు కొండంత బలం.

ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించిన ట్రెవర్‌ బెయిలీస్‌ నిరుడు ప్రధాన కోచ్‌గా రావడంతో వ్యూహ బృందం మరింత పటిష్టమైంది. బెయిలీస్‌ కోచింగ్‌లో నిరుడు ఆరంభంలో తడబడినా ఆఖర్లో అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చి ప్లేఆఫ్స్‌ చేరుకుంది. తొలి ప్లేఆఫ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తుచేసింది. రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది.

బలాలు..

బలాలు..

టాపార్డర్ బ్యాట్స్‌మెన్, బౌలింగ్ డెప్త్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలాలు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు వార్నరే పెద్ద దిక్కు. క్రీజులో ఉన్నంతసేపు అతను పరుగుల యంత్రమే. ఫీల్డింగ్‌లో మహా చురుకు. నాయకత్వంలోనూ వార్నర్‌ది ప్రత్యేకమైన శైలి. సీనియర్‌ బౌలర్లకు బౌలింగ్‌ వ్యూహాన్ని వదిలేసి లాంగాన్‌ లేదా లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేసే కెప్టెన్‌ బహుశా వార్నర్‌ ఒక్కడేనేమో. వార్నర్‌కు మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో జతకలిస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లే. వీరిద్దరు క్రీజులో ఉంటే మిడిలార్డర్‌కు పనే ఉండదు. పరుగుల ప్రవాహం అదుపులో ఉండదు. 2019 సీజన్‌లో అదే జరిగింది. ఆ సీజన్‌లో వార్నర్‌- బెయిర్‌స్టోల జోడీ పరుగుల సునామీ సృష్టించింది. వీరికి మిడిలార్డర్‌ నుంచి సహకారం లభిస్తే బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

మరోవైపు ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సొంతం. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్‌, నటరాజన్‌, సందీప్‌శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లతో పటిష్టమైన దేశీయ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరుడు జట్టులో చేరిన జాసన్ హోల్డర్‌ బౌలింగ్‌లో కీలకంగా మారాడు. ఇక లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఎప్పటికీ మ్యాచ్‌ విన్నరే. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ జట్టులో చేరడం సన్‌రైజర్స్‌కు మరో సానుకూలాంశం.

బలహీనతలు..

బలహీనతలు..

టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌పై అతిగా ఆధారపడటం సన్‌రైజర్స్ అతిపెద్ద బలహీనత. సరైన మ్యాచ్ ఫినిషర్ లేకపోవడం మరో సమస్య. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండేతో కూడిన టాపార్డర్ విఫలమైతే సన్‌రైజర్స్‌ దాదాపుగా మ్యాచ్‌ను కోల్పోయినట్లే. మిడిలార్డర్‌కు తగినంత అనుభవం లేకపోవడం జట్టును కీలక సమయాల్లో దెబ్బతీస్తోంది. గత సీజన్‌లో విలియమ్సన్ మిడిలార్డర్ బాధ్యతను మోసాడు. మనీష్‌ పాండేలో నిలకడ లేకపోవడం.. ప్రియం గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మలకు అనుభవం లేకపోవడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. గత ఏడాది సన్‌రైజర్స్‌ పెట్టుకున్న అంచనాల్ని ఈ ముగ్గురు నిలబెట్టుకోలేకపోయారు. అత్యున్నత స్థాయిలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమయ్యారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నదే సన్‌రైజర్స్‌ ముందున్న సవాల్‌.

వీరికి తోడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఫినిషర్ రోల్ కోసం సన్‌రైజర్స్ ఈసారి కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో నిరాశపర్చిన కేదార్ ఇటీవల విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో ఫర్వాలేదనిపించాడు. కానీ జట్టు అవసరాలకు ఉపయోగపడుతాడా? లేదా? అనేది ప్రశ్నార్థకం. బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌పై టీమ్ అతిగా ఆధారపడుతోంది. ఇక వార్నర్‌, విలియమ్సన్‌, బెయిర్‌స్టో, రషీద్‌, హోల్డర్‌, జాసన్‌ రాయ్‌, మహ్మద్‌ నబీ, ముజిబుర్‌ రహమాన్‌ వంటి నాణ్యమైన విదేశీ ఆటగాళ్ల నుంచి నలుగురిని తుది జట్టులోకి ఎంపిక చేసుకోవడం సన్‌రైజర్స్‌కు సవాలే.

ప్లే ఆఫ్స్ అంచనా..

ప్లే ఆఫ్స్ అంచనా..

టైటిల్ ఫేవరేట్స్‌లో సన్‌రైజర్స్ కూడా ఒకటి. తుది జట్టులో నలుగురు ఫారినర్లు మాత్రమే ఉండాలనే రూల్‌కు అనుగుణంగా సరైన కాంబినేషన్ ఎంచుకోవడంపై సన్‌రైజర్స్ జర్నీ ఆధారపడి ఉంది. ఫైనల్ ఎలెవన్ కుదిరి మంచి స్టార్ట్ దొరికితే ప్రత్యర్థికి తిప్పలు తప్పవు. ఈజీగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

సన్‌రైజర్స్ హైదరాబాద్:

బ్యాట్స్‌మెన్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, జేసన్ రాయ్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విరాట్ సింగ్, జానీ బెయిర్‌స్టో

కీపర్స్: వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స గోస్వామి, జానీ బెయిర్‌స్టో

ఆల్‌రౌండర్స్: కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మ, రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ నబి, జేసన్‌ హోల్డర్‌

బౌలర్స్: భువనేశ్వర్‌కుమార్‌, నటరాజన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, జగదీశ సుచిత్‌, ముజిబుర్‌ రహమాన్‌

Story first published: Monday, April 5, 2021, 11:21 [IST]
Other articles published on Apr 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+