మనీశ్ కీలకం:
తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో విధ్వంసకర ఓపెనర్లు, ఫినిషర్లు, స్టార్ బౌలర్లు ఉన్నారు. అయితే బౌలింగ్‌తో పోలిస్తే.. బ్యాటింగ్ కాస్త వెనుకబడే ఉంది. మంచి ఓపెనర్లు, ఫినిషర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ సాంతం ఆడుతూ వారికి అండగా నిలిచే ఆటగాళ్లు అవసరం. భారత యువ ఆటగాడు మనీశ్ పాండే.. సన్‌రైజర్స్ టీంలో ఇదే పాత్రను పోషిస్తున్నాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతూ వికెట్లు పడకుండా పరుగులు చేస్తున్నాడు.

కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న పాండే:
మనీశ్ పాండే సన్‌రైజర్స్ టీంలో కీలక ఆటగాడు కాబట్టి.. ఐపీఎల్ 2021లో అతడు ఎలా ఆడాలని కోరుకుంటుందో తాజాగా ఆ జట్టు యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాలోని ఓ పోస్టర్‌ను సన్‌రైజర్స్ ఎడిట్ చేసింది. కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మనీశ్‌తో ఎడిట్ చేసింది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. 'మనీశ్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనకు తెలిసిందే. నిర్దాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్' అని కాప్షన్ పెట్టింది. పాండే అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నాడు.

ఇక రచ్చరచ్చే:
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ అభిమానులు ఈ పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కత్తిపట్టిన మనీష్ పాండే.. ఇక రచ్చరచ్చే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఎన్టీఆర్‌లానే మనీష్ కూడా రెచ్చిపోవాలి' అని మరొకరు కెమెంట్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పోస్టుపై మండిపడుతున్నారు. 'ఇలాంటివి ఆపి.. త్వరగా ప్రాక్టీస్ మొదలెట్టండి' అంటూ ట్వీట్లు చేస్తున్నారు. చెన్నై వేదికగా వచ్చే నెల 11న సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులకు గాను 11 మ్యాచులు రాత్రి 7.30 గంటలకి హైదరాబాద్ ఆడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్:
1) ఏప్రిల్ 11న కోల్‌కతాతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
2) ఏప్రిల్ 14న బెంగళూరుతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
3) ఏప్రిల్ 17న ముంబైతో (చెన్నైలో రాత్రి 7.30 గంటలకి)
4) ఏప్రిల్ 21న పంజాబ్‌తో (చెన్నైలో మధ్యాహ్నం 3.30 గంటలకి)
5. ఏప్రిల్ 25న ఢిల్లీతో (ముంబైలో రాత్రి 7.30 గంటలకి)
6. ఏప్రిల్ 28న చెన్నైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి
7. మే 2న రాజస్థాన్‌తో (ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకి)
8. మే 4న ముంబైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి)
9. మే 7న చెన్నైతో (ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకి)
10. మే 9న బెంగళూరుతో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
11. మే 13న రాజస్థాన్‌తో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
12. మే 17న ఢిల్లీతో (కోల్‌కతాలో రాత్రి 7.30 గంటలకి)
13. మే 19న పంజాబ్‌తో (బెంగళూరులో రాత్రి 7.30 గంటలకి)
14. మే 21న కోల్‌కతాతో (బెంగళూరులో మధ్యాహ్నం 3.30 గంటలకి)
India vs England: అలవాటులో పొరపాటు.. స్టోక్స్‌కు అంపైర్ వార్నింగ్!!


Click it and Unblock the Notifications












