For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar All Time IPL 11: కెప్టెన్‌గా ధోనీ..మ‌లింగ‌ల‌కు షాక్! నలుగురు బౌలర్లకే అవకాశం!!

IPL 2021: Sunil Gavaskar picks his All Time IPL XI, MS Dhoni led team, No place for Lasith Malinga

హైదరాబాద్: గతకొంత కాలంగా క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ఒకరోజు ముందు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో గవాస్కర్ తన టీమ్‌ని ప్రకటించాడు.

కెప్టెన్‌గా ధోనీ

కెప్టెన్‌గా ధోనీ

సునీల్ గవాస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ టీమ్‌కి కెప్టెన్, వికెట్ కీపర్‌గా చెన్నై సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్రిస్ ‌గేల్‌ని ఎంచుకున్నాడు. అయితే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని మూడో స్థానానికి పరిమితం చేశాడు. ఇక విరాట్ కోహ్లీకి నెం.4లో అవకాశం ఇచ్చాడు సన్నీ. ఇక మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకి తన జట్టులో గవాస్కర్ అవకాశం కల్పించాడు. ఐపీఎల్ టోర్నీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే రైనాకు ఐదవ స్థానం ఇచ్చాడు. ఇక ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్ ధోనీకి ఫినిషర్ బాధ్యతలు అప్పగించాడు.

నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లను మాత్రమే

నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లను మాత్రమే

రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకి సునీల్ గవాస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ టీమ్‌లో చోటిచ్చాడు. ఇద్దరూ బ్యాటింగ్ కూడా చేయగలరు. ఇక పేస్ విభాగంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్స్ భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాకి చోటు దక్కింది. అయితే గవాస్కర్ నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లను మాత్రమే తీసుకోవడం ఇక్కడ గమనార్హం. టీ20ల్లో ఒక్కో బౌలర్‌ గరిష్ఠంగా 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో 4 ఓవర్లు రైనా, రోహిత్ లేదా గేల్ కచ్చితంగా వేయాల్సి ఉంటుంది. పేస్ విభాగంలో ఐపీఎల్ అత్యధిక వికెట్ల ధీరుడు లసిత్ మలింగకు సన్నీ అవకాశం ఇవ్వలేదు.

నన్ను క్షమించండి

నన్ను క్షమించండి

ఆల్‌టైమ్ ఐపీఎల్‌ జట్టును సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఓ సెలెక్టర్ ఉద్యోగం ఎంత కఠినమైనదో గ్రహించినట్లు సునీల్ గవాస్కర్ అంగీకరించాడు. 'నా జట్టులో అందరిని ఎంచుకోలేను. జట్టులో చోటివ్వని ఆటగాళ్లు నన్ను క్షమించండి. నేను నా జీవితంలో ఎప్పుడూ సెలెక్టర్ కాలేదు. ఓ జట్టును ఎంచుకోవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది' అని గవాస్కర్ తెలిపాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా తన అత్యుత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు.

సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్:

సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్:

రోహిత్ శర్మ, క్రిస్ ‌గేల్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

IPL 2021: గేల్‌కు ఎప్పుడూ అదే ధ్యాస.. అయినా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు! అది ఎలా సాధ్యం: రాహుల్‌

Story first published: Thursday, April 8, 2021, 17:51 [IST]
Other articles published on Apr 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+