న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: గేల్‌కు ఎప్పుడూ అదే ధ్యాస.. అయినా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు! అది ఎలా సాధ్యం: రాహుల్‌

IPL 2021: KL Rahul says Chris Gayle is always partying but he performs well with the bat

ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్ తరచూ పార్టీలకు వెళుతుంటాడని, అయినా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని కింగ్స్‌ సారధి కేఎల్‌ రాహుల్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2020‌లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్‌ ఫామ్‌ను కనబర్చిన గేల్‌.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్‌ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రేపు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా శుక్రవారం జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది.

గేల్‌తో ఆడటం కోసం ఎదురుచూస్తున్నా

గేల్‌తో ఆడటం కోసం ఎదురుచూస్తున్నా

తాజాగా రెడ్ బుల్ యొక్క డీకోడింగ్ అథ్లెట్స్ సిరీస్‌లోని పోడ్కాస్ట్‌లో కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ... 'క్రిస్ గేల్‌తో కలిసి చాలా కాలం ఆడాను. అతనితో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. గేల్‌తో కలిసి గతేడాది కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాను. ఇప్పడు ఐపీఎల్‌ కొత్త సీజన్‌ కూడా వచ‍్చేసింది. అతనితో మళ్లీ ఆడటం కోసం ఎదురుచూస్తున్నా. గేల్ కూడా సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది మరింత రాటు దేలుతున్నాడు. ప్రతి ఏడాది గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపోతున్నా. అతడు తరచూ పార్టీలకు వెళ్లినా.. గొప్పగా ఆడుతున్నాడు' అని అన్నాడు.

అలాంటి ఫిట్‌నెస్‌ ఉంటే బాగుండేది

అలాంటి ఫిట్‌నెస్‌ ఉంటే బాగుండేది

'ఇప్పటికే పంజాబ్‌తో కలిసిన క్రిస్ గేల్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను మరోసారి చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. అసలు గేల్‌ ఇంత ఫిట్‌నెస్‌ ఎలా సాధించాడనేది అర్థం కాలేదు. ఏకధాటిగా 3-4 గంటలు పాటు బ్యాటింగ్‌ చేసిన తర్వాత కూడా భారీ సిక్సర్లు కొట్టడం అతనికే సాధ్యమైంది. నాక్కుడా అలాంటి ఫిట్‌నెస్‌ ఉంటే బాగుండేది' అని పంజాబ్ కింగ్స్‌ సారధి కేఎల్‌ రాహుల్‌ సరదాగా అన్నాడు. గత సంవత్సరం పంజాబ్ జట్టు మంచి క్రికెట్ ఆడినా.. కొన్ని కారణాల వల్ల ప్లేఆప్స్ చేరుకోలేదన్నాడు. జట్టు పేరు, జెర్సీల మార్పు మాకు కొంత అదృష్టాన్ని తెస్తుందేమో చూడాలన్నాడు. రిలే మెరెడిత్ బౌలింగ్ కోసం ఎదురుచూస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు.

670 పరుగులు

670 పరుగులు

పంజాబ్‌ కింగ్స్‌ గతేడాది సీజన్‌లో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపాడు. మొత్తం 14 మ్యాచ్‌లాడిన రాహుల్‌ ..ఒక సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 670 పరుగులు సాధించాడు. టోర్నీలో మనోడిదే అత్యధిక స్కోర్. ఈసారి కూడా అదే ఫామ్ చాటాలని చూస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రాహుల్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక పంజాబ్‌ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.‌

 గేల్‌ క్వారంటైన్ పూర్తి

గేల్‌ క్వారంటైన్ పూర్తి

క్రిస్‌ గేల్‌ తప్పనిసరి ఏడు రోజుల క్వారంటైన్‌ను బుధవారం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అదిరిపోయే స్టెప్పులతో యూనివర్సల్‌ బాస్‌ అలరించాడు. క్వారంటైన్‌ పూర్తైన ఆనందంలో గేల్‌.. మైఖేల్‌ జాక్సన్‌ సూపర్‌ హిట్‌ 'మూన్‌ వాక్‌' సాంగ్‌కు డ్యాన్స్‌ చేశాడు. బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'క్వారంటైన్‌ పూర్తయింది. మీ ఫేవరేట్ గేల్ బయటికి వచ్చాడు' అని ట్వీట్ చేసింది.

IPL 2021: 'భారత్‌కు రావడం ఇది 22వ సారి.. ఈ అనుభవంతో ఆర్సీబీకి కప్ తెస్తా'

Story first published: Thursday, April 8, 2021, 15:51 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X