IPL 2021: 'నా లక్ష్యం ఐపీఎల్ టైటిల్ గెలవడమే.. మా జట్టుకు అది పెద్ద కష్టమేమీ కాదు'

చెన్నై: తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్‌లో తొలి ట్రోఫీని చూడటానికి ఆతృతగా ఉన్నానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. తన లక్ష్యం ఐపీఎల్ టైటిల్ గెలవడమే అని పేర్కొన్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన స్మిత్.. ఈ ఏడాది ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 వేలానికి ముందు రాజస్థాన్ స్మిత్‌ను వదిలేయడంతో అతన్ని ఢిల్లీ కొనుగోలు చేసింది. స్మిత్ అతని కనీస ధర రూ. 2.2 కోట్ల అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.

టైటిల్ గెలవడమే లక్ష్యం
తాజాగా స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులతో ఉన్న అనుభవాలను పంచుకున్నాడు. 'ఢిల్లీ జట్టు వాతావరణం చాలా బాగుంది. ప్రస్తుతం ఢిల్లీకి మంచి జట్టు ఉంది. మేము ఐపీఎల్ ట్రోఫీని సాధించడం కష్టమే కాదు. చేయగల్గిన ప్రతీదాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. మా లక్ష్యం ట్రోఫీని సాధించడమే. మ్యాచులను గెలుచుకుంటూ వెళ్లడమే మా ప్రణాళిక. ఆటగాళ్లు విజయాలను ఎంజాయ్ చేస్తున్నారు. నా లక్ష్యం కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలవడమే' అని స్మిత్ అన్నాడు.

రెండు మ్యాచ్‌ల్లో 42 రన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్ స్మిత్.. పంజాబ్ కింగ్స్ జట్టుపై 9 పరుగులే చేసి నిరాశపరిశాడు. ఇక ముంబై ఇండియన్స్‌పై 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మరో రెండు మ్యాచుల్లో స్మిత్ ఆడలేదు. ఇప్పటివరకు ఢిల్లీ నాలుగు మ్యాచులు ఆడగా.. మూడింట్లో నెగ్గింది. ఆరు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. అయితే గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమవ్వడం కాస్త కలవరపెట్టే అంశం.
రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్న మిథాలి రాజ్!!

14 మ్యాచ్‌ల్లో 311 పరుగులు:
ఐపీఎల్ 2020లో స్టీవ్ స్మిత్ విఫలమయిన విషయం తెలిసిందే. అతని సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ గతేడాది 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసిన స్మిత్ బ్యాట్స్‌మన్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూ.12.4 కోట్ల భారీ ధరకు తీసుకున్న రాజస్థాన్ స్మిత్‌పై వేటు వేసింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ను తమ నూతన సారథిగా నియమించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి:
2021 ఐపీఎల్ సీజన్‌లో ఆడుతున్న ప్రాంచైజీల్లో టైటిల్స్ సాధించని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌లు సైతం ఇంకా ఖాతా తెరవలేదు. ఈ మూడు జట్లు ఫైనల్ వరకూ వెళ్లినా టైటిల్స్ సాధించలేకపోయాయి. ఈసారి బెంగళూరు ఆ దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లో అన్ని విజయాలు అందుకుంది. మరో నాలుగు మ్యాచులు గెలిస్తే.. ప్లే ఆఫ్ వెళుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications