Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni చెన్నై సూపర్ కింగ్స్ గుండెచప్పుడు: కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్

IPL 2021: Stephen Fleming says MS Dhoni is the heartbeat of Chennai Super Kings

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్‌కింగ్స్‌ గుండెచప్పుడని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసించాడు. కింగ్స్ పంజాబ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో చెన్నై 6 వికెట్లతో గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌తో ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫ్లెమింగ్.. 2008 నుంచి చెన్నైకి సారథ్యం వహిస్తున్న ధోనీని ఉద్దేశించి ప్రశంసల జల్లు కురిపించాడు.

సీఎస్‌కే హాట్ బీట్..

సీఎస్‌కే హాట్ బీట్..

200 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా తమ జట్టు బాగా రాణించాలని కోరుకోవడం ఫ్రాంచైజీపై, ఆటపై ధోనీ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నాడు. అతని సుదీర్ఘ సేవలను కచ్చితంగా గుర్తించాలన్నాడు. ఫ్రాంచైజీతో మహీ.. మహీతో ఫ్రాంచైజీ కలిసి ఎదగడం జరిగిందన్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ గుండెచప్పడని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ప్రదర్శన, మార్గనిర్దేశం, నాయకత్వంలో అతనికి తిరుగులేదని ప్రశంసించాడు.

దీపక్ సూపర్..

దీపక్ సూపర్..

తమ జట్టు ఓటమి తర్వాత పుంజుకొని విజయాన్నందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ముఖ్యంగా తన స్వింగ్‌తో పంజాబ్‌ కింగ్స్ టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చిన దీపక్‌ చాహర్‌ (4/13)పై ఫ్లెమింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'తొలి మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకొని విజయాన్నందుకోవడం ఆకట్టుకుంది. ముఖ్యంగా దీపక్ చాహర్ ప్రదర్శన అద్భుతం. బంతిని స్వింగ్‌ చేయడమే కాకుండా అతని నియంత్రణ, నైపుణ్యాలు అమోఘం. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు అతన్ని ఆపడం కష్టం. తొలి మ్యాచ్‌లో తేమ వల్ల గెలిచేందుకు అవకాశాలు సృష్టించుకోలేకపోయాం.'అని ఫ్లెమింగ్ వివరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ చెన్నై ఓటమిపాలైన విషయం తెలిసిందే.

విభిన్న ప్రణాళికలు..

విభిన్న ప్రణాళికలు..

ఇక ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు అండగా ఉంటామని ఫ్లెమింగ్‌ స్పష్టం చేశాడు. అతను మంచి ఆటగాడని తెలిపాడు. ఫస్ట్ మ్యాచ్‌లో మంచి బంతికి అతను ఔటయ్యాడని, తాజా మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో పెవిలియన్ చేరాడన్నాడు. తనదైన రోజు రుతురాజ్ రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిస్థితులను బట్టి తుది జట్టు ఉంటుందన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లే రాణిస్తే మిగతావాళ్లకు అవకాశాలు కష్టమేనన్నాడు. పంజాబ్‌ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. అతని కోసం విభిన్నంగా ఫీల్డర్లను మోహరించామని పేర్కొన్నాడు. అతన్ని స్వింగ్‌ బంతులతో ఎల్బీ చేయాలని భావించగా.. మరో రూపంలో అతను పెవిలియన్‌ చేరాడని చెప్పుకొచ్చాడు.

ఏకపక్ష మ్యాచ్..

ఏకపక్ష మ్యాచ్..

పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ను 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దీపక్‌ చహర్‌ (4/13) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. షారుఖ్‌ ఖాన్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్యామ్‌ కరన్, మొయిన్‌ అలీ, డ్వేన్‌ బ్రావోలు తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మొయిన్‌ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌)... డు ప్లెసిస్‌ (33 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

Story first published: Saturday, April 17, 2021, 17:59 [IST]
Other articles published on Apr 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+