Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: బెంగళూరుతో హైదరాబాద్ ఢీ.. బోణీపై కన్నేసిన సన్‌రైజర్స్‌! కేన్ మామ డౌటే! తుది జట్లు ఇవే!

IPL 2021, SRH vs RCB Preview: Dream11 Prediction, Playing XI and Match Details

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో మరో ఆసక్తికర సమరంకు వేళయింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఇదే మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్.. టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను బోల్తా కొట్టించిన బెంగళూరు మరో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో అభిమానులకు మజా లభించడం ఖాయం. ఈ రోజు మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం.

 కేన్ మామ అనుమానమే

కేన్ మామ అనుమానమే

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి తొలి మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఇద్దరూ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటీవల విఫలమవుతున్న వార్నర్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. గత మ్యాచులో మనీశ్ పాండే హాఫ్ సెంచరీ నమోదు చేసినా.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్ ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడు. మనీష్ వేగంగా ఆడితే చాలు. ఇక ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి.. కేన్ మామ మ్యాచ్ ఆడేది అనుమానమే. గత మ్యాచులో అతడిని తీసుకోలేదని విమర్శలు వచ్చినా.. కేన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.

మిడిల్ ఆర్డర్ సమస్య

మిడిల్ ఆర్డర్ సమస్య

సన్‌రైజర్స్ జట్టుకు ఉన్న సమస్య ఒకటే. అదే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మిడిల్‌లో సరైన ఆటగాళ్లు లేక ఎన్నో ఓటములు చవిచూసింది. విజయ్ శంకర్, మహ్మద్ నబీ నిలకడలేమితో ఇబ్బందిపడుతన్నారు. వీరు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక యువ హిట్టర్ అబ్దుల్ సమద్ అలవోకగా సిక్సర్లు బాదుతుండటం ఊరట కలిగించే అంశం. బౌలింగ్‌లో మాత్రం రషీద్ ఖాన్, మహ్మద్ నబీ చెపాక్ పిచ్‌పై ఆకట్టుకుంటున్నారు. అయితే భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. టీ నటరాజన్ కూడా ఆరంభంలో పరుగులిస్తున్నా.. స్లాగ్ ఓవర్లలో పర్వాలేదనిపిస్తున్నాడు. బెంగళూరుతో పోలిస్తే.. హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.

పవర్ హిట్టర్లతో బెంగళూరు

పవర్ హిట్టర్లతో బెంగళూరు

బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మంచి టచ్‌లో ఉన్నారు. గత మ్యాచులో ముగ్గురు చెలరేగారు. ఓపెనర్ వాషింగ్టన్ సుందర్, మూడో స్థానంలో ఆడిన పాటిదార్ అంచనాల్ని అందుకోలేకపోయారు. దేవదత్ పడిక్కల్ మ్యాచ్ ఆడుతుండడంతో.. పాటిదార్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. డేనియల్ క్రిస్టియన్ కూడా ఆల్‌రౌండర్‌గా విఫలమయ్యాడు. బౌలింగ్‌లో చహల్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చేశాడు. సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కించుకోలేకపోయాడు. అయితే బౌలర్ జెమీషన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేస్తుండడం వారికి కలిసొచ్చే అంశం. కైల్ జామిసన్, హర్షల్ పటేల్ ఉండనే ఉన్నారు.

బెంగళూరుపై హైదరాబాద్‌ పైచేయి

బెంగళూరుపై హైదరాబాద్‌ పైచేయి

బెంగళూరుపై హైదరాబాద్‌ పైచేయిలా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లకిగానూ ఏడింట్లో బెంగళూరు జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి పోరు చాలా ఆసక్తికంగా జరుగుతుంది. ఐపీఎల్‌లో బెంగళూరుపై ఇప్పటి వరకూ హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులుకాగా.. హైదరాబాద్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ/జాసన్ హోల్డర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్.

బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్.

డ్రీం ఎలెవన్ టీమ్:

ఏబీ డివిలియర్స్ (కీపర్), వృద్దిమాన్ సాహా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ , అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, టీ నటరాజన్, కైల్ జేమిసన్.

KKR vs MI: 99 మీటర్ల భారీ సిక్స్.. నోరెళ్లబెట్టేసిన హార్దిక్ పాండ్యా!! (వీడియో)

Story first published: Wednesday, April 14, 2021, 14:17 [IST]
Other articles published on Apr 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+