Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs MI: 99 మీటర్ల భారీ సిక్స్.. నోరెళ్లబెట్టేసిన హార్దిక్ పాండ్యా!! (వీడియో)

IPL 2021: Suryakumar Yadavs massive Six leaves Hardik Pandya shell shocked

చెన్నై: ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్.. అక్కడి ఫామ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ (56: 36 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో సూర్యకుమార్ కొట్టిన 99 మీటర్ల సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. డగౌట్ నుంచి ఆ షాట్ చూసిన ముంబై ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా.. అమ్మో అంటూ నోరెళ్లబెట్టేశాడు.

ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్.. ఐదో బంతిని ఆఫ్ స్టంప్‌ లైన్‌పై గంటకి 135.1 కిమీ వేగంతో సంధించాడు. దాంతో ఆఫ్ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లిన సూర్యకుమార్ యాదవ్ డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ బ్యాటుకు కనెక్ట్ అవడంతో.. ఎక్కువగా ఎత్తులో వెళ్లిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. 99 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్సర్ అభిమానులను అలరించింది. ఈ సిక్సర్ కొట్టిన సమయంలో సూర్యకుమార్ సహచరుడు హార్దిక్ పాండ్యా స్టాండ్స్‌లో నిలబడి ఇచ్చిన రియాక్షన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ షాట్ చూసి షాకైనట్లు కనబడుతున్న హార్దిక్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రస్తుతం నెట్టంట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 152 పరుగులకి ఆలౌట్ అయింది. ముంబై మొత్తం 3 సిక్సర్లు మాత్రమే కొట్టింది. ఇందులో రెండు సిక్సులు సూర్యకుమార్ యాదవ్ బాదగా.. ఓ సిక్స్ రోహిత్ శర్మ కొట్టాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా మ్యాచ్ మొత్తం మూడు సిక్సులనే బాదింది. ఓపెనర్ నితీష్ రాణా రెండు, గిల్ మరొకటి బాదారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు.

స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ మాయ చేయడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఐపీఎల్‌ 2021లో బోణీ కొట్టింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై రోహిత్ సేన విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 7×4, 2×6), రోహిత్‌ శర్మ (43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో మొదట ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రసెల్‌ (5/15), కమిన్స్‌ (2/24) నిప్పులు చెరిగారు. ఛేదనలో నితీష్‌ రాణా (57; 47 బంతుల్లో 6×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (33; 24 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో కోల్‌కతా గెలిచేలా కనిపించింది. చహర్‌తో పాటు కృనాల్‌ (1/13), బౌల్ట్‌ (2/27), బుమ్రా (0/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోల్‌కతా 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది.

Story first published: Wednesday, April 14, 2021, 13:06 [IST]
Other articles published on Apr 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+