Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: కేన్‌ మామకు చోటు దక్కెనా? సన్‌రైజర్స్ బోణీ కొట్టెనా? తుది జట్లు ఇవే!

IPL 2021: SRH vs KKR Dream11 Team Prediction, Tips, Best Playing 11 Details

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి పోరుకు సిద్దమైంది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్‌లో మూడో ప్లేస్‌తో ముగించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం టోర్నీని విజయంతో మొదలుపెట్టాలని భావిస్తోంది.

మరోవైపు కోల్‌కతా నైట్‌రైటర్స్ కూడా గత సీజన్‌లో తమ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఇరు జట్లలో స్టార్లకు కొదవలేకపోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. అయితే ఈ సీజన్‌లో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆయా జట్లు ఊహకందని వ్యూహాలు, తుది జట్లతో బరిలోకి దిగి అందర్ని ఆశ్చర్యపరిచాయి. ఫలితాలను రాబట్టాయి. మరీ ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఎలాంటి జట్లతో బరిలోకి దిగుతాయో?

బలంగా హైదరాబాద్..

బలంగా హైదరాబాద్..

స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. గాయం వల్ల భారత్‌తో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్‌.. ఫిట్‌నెస్‌కు ఈ సీజన్ పరీక్షగా నిలవనుంది. కాగా, వార్నర్‌తో పాటు బెయిర్ స్టో, విలియమ్సన్, పాండేతో టాపార్డర్ చాలా బలంగా ఉంది. వీరికి తోడు వృద్దిమాన్ సాహా కూడా అందుబాటులో ఉన్నాడు.

గత సీజన్‌లో ఓపెనర్‌గా సత్తా చాటిన సాహా.. మళ్లీ చెలరేగితే లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్‌లో నేషనల్ టీమ్ రేసులో నిలుస్తాడు. అయితే మిడిలార్డర్ మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోంది. విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, ప్రియమ్ గార్గ్ ఈ ప్లేస్‌ల కోసం పోటీలో ఉండగా.. వీరిపై నమ్మకం ఉంచడానికి లేదు. ఇక బౌలింగ్ సన్‌రైజర్స్ ఎప్పట్లానే బలంగా కనిపిస్తోంది. యార్కర్ కింగ్ నటరాజన్‌తో కలిసి భువీ పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ రషీద్ కీలకం కానున్నాడు.

కేన్ మామ ఆడెనా?

కేన్ మామ ఆడెనా?

ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా బెయిర్ స్టో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో చెలరేగాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో మనీష్ పాండే వస్తాడు. ఇక నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్ రావడంపైనే సందేహాలు నెలకొన్నాయి. అతని గాయం‌పై క్లారిటీ లేకపోవడం ఒక కారణమైతే మరో రీజన్ జేసన్ హోల్డర్.

ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత సీజన్‌ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. హోల్డర్‌ను జట్టులోకి తీసుకోవాలంటే బెయిర్ స్టో/ కేన్ ఇద్దరిలో ఒకరు బెంచ్‌కే పరిమితం కావచ్చు. దూకుడు మీదున్న బెయిర్ స్టోను పక్కన పెట్టే సాహసం ఆరెంజ్ ఆర్మీ చేయకపోవచ్చు. ఒకవేళ మిడిలార్డర్‌ను బలం చేయాలనే భావిస్తే.. ఓపెనర్‌గా సాహాను పంపించి కేన్, హోల్డర్‌ను తీసుకోవచ్చు. అయితే భువీతో బౌలింగ్ లైనప్ బలంగా ఉన్న నేపథ్యంలో హోల్డర్‌ను తీసుకోకపోవచ్చు.

మోర్గాన్ మెరిపిస్తాడా?

మోర్గాన్ మెరిపిస్తాడా?

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న కేకేఆర్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ సీజన్‌కు సిద్దమైంది. మోర్గాన్ తన మ్యాజిక్‌ చూపిస్తాడని నమ్మకంగా ఉంది. అయితే కేకేఆర్ టాపార్డర్ కాస్తవీక్‌గా కనిపిస్తోంది. గిల్‌కు సరైన ఓపెనింగ్ పార్టనర్‌ను ఎంచుకోవాల్సి ఉంది. నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, మోర్గాన్, షకీబ్, రసెల్‌తో మిడిలార్డర్ మాత్రం చాలా బలంగా ఉంది.

గత సీజన్‌లో ఫ్లాఫ్ అయిన హిట్టర్ రసెల్ నుంచి జట్టు భారీగా ఆశిస్తోంది. రసెల్ ఫెయిలైతే కేకేఆర్‌కు సరైన ఫినిషర్ లేడు. ఇక, స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. షకీబ్, నరైన్‌కు తోడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సీనియర్ హర్భజన్ సింగ్ జట్టులో ఉన్నారు. ఇక, ప్యాట్ కమిన్స్, ప్రసిధ్ కృష్ణ, శివమ్ మావితో పేస్ విభాగం కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో(కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్/అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్

కోల్‌కతా నైట్‌రైడర్స్:

శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి/వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్/షకీబ్ అల్ హసన్, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి/హర్భజన్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తీ

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), షకీబ్ అల్ హసన్, ఆండ్రూ రస్సెల్, ప్యాట్ కమిన్స్, టీ నటరాజన్, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్

Story first published: Sunday, April 11, 2021, 8:51 [IST]
Other articles published on Apr 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+