Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC Super Over: ఉత్కంఠపోరులో హైదరాబాద్‌కు తప్పని ఓటమి.. సూపర్ ఓవర్ సాగిందిలా!!

IPL 2021: SRH vs DC Super Over highlights, Delhi beat Hyderabad
IPL 2021 : SRH సూపర్ ఓవర్ లో Short Run, Kane Williamson ఒక్కడే.. | SRH Vs DC || Oneindia Telugu

చెన్నై: టీ20 మజా అంటే ఇదే కదా అన్నట్టు సాగింది ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్. రెండు జట్లతో విజయం దోబూచులాడినా.. చివరకు 'సూపర్‌' ముగింపు ఢిల్లీకే దక్కింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారి సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై క్యాపిటల్స్‌ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్లో మొదట హైదరాబాద్‌ 7 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో రిషబ్ పంత్‌ ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

 పృథ్వీ షా ఫిఫ్టీ

పృథ్వీ షా ఫిఫ్టీ

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి మూడు బంతులను హ్యాట్రిక్‌ ఫోర్లుగా మలిచిన పృథ్వీ షా (53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌).. మరుసటి ఓవర్‌లో మరో రెండు బౌండ్రీలు బాదాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. కాస్త నిదానంగా ఆడిన శిఖర్ ధావన్ (28)ను రషీద్‌ ఖాన్ ఔట్‌ చేయగా.. రిషబ్ పంత్‌ (37: 27 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌)తో సమన్వయ లోపం కారణంగా పృథ్వీ రనౌటయ్యాడు. అయినా స్టీవ్ స్మిత్‌ (34: 25 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌)తో కలిసి పంత్‌ నిలకడ కొనసాగించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది.

SRH vs DC: ఏడ దొరికాడురా ఈ విరాట్ గాడు.. 20 ఓవర్లను 18గా చేశాడు! మనీష్ కంటే తాతలా ఉన్నాడుగా!

సుచిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌:

సుచిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌:

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఛేదనలో ఆరంభం నుంచే జానీ బెయిర్‌స్టో (38; 18 బంతుల్లో 3×4, 4×6) బాదుడు మొదలుపెట్టాడు. డేవిడ్ వార్నర్‌ (6) ఔటైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ దంచిన జానీ.. అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ ఓ బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌ కొట్టే క్రమంలో ఔటయ్యాడు. బెయిర్‌స్టో వెనుదిరిగాక సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మందగించింది. కేన్ విలిమయ్సన్‌ (66 నాటౌట్‌: 51 బంతుల్లో 8X4) వరుసగా రెండు ఫోర్లు కొట్టి మళ్లీ స్కోరు బోర్డు కదిలించాడు. కానీ విరాట్‌ సింగ్‌ (14 బంతుల్లో 4) తడబడడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. దీనికి తోడు కేదార్‌ జాదవ్‌ (9) కూడా ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ వెనకబడిపోయింది. అయితే సుచిత్‌ (14 నాటౌట్‌; 6 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టును పోటీలో నిలిపాడు.

సూపర్ ఓవర్ సాగిందిలా:

సూపర్ ఓవర్ సాగిందిలా:

సన్ రైజర్స్ బ్యాటింగ్:

బాల్ 1: అక్షర్ x వార్నర్ - నో రన్

బాల్ 2: అక్షర్ x వార్నర్ - 1 రన్

బాల్ 3: అక్షర్ x విలియమ్సన్ - ఫోర్

బాల్ 4: అక్షర్ x విలియమ్సన్ - నో రన్

బాల్ 5: అక్షర్ x విలియమ్సన్ - 1 లెగ్ బై

బాల్ 6: అక్షర్ x విలియమ్సన్ - 1 రన్

ఢిల్లీ బ్యాటింగ్:

ఢిల్లీ బ్యాటింగ్:

బాల్ 1: రషీద్ ఖాన్ x పంత్ - 1 రన్

బాల్ 2: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై

బాల్ 3: రషీద్ ఖాన్ x పంత్ - ఫోర్

బాల్ 4: రషీద్ ఖాన్ x పంత్ - నో రన్

బాల్ 5: రషీద్ ఖాన్ x పంత్ - 1 లెగ్ బై

బాల్ 6: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై

Story first published: Monday, April 26, 2021, 7:38 [IST]
Other articles published on Apr 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+