Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: ఏడ దొరికాడురా ఈ విరాట్ గాడు.. 20 ఓవర్లను 18గా చేశాడు! మనీష్ కంటే తాతలా ఉన్నాడుగా!

Virat Singh Trolled Brutally By SRH Fans, Compared Him As Manish Pandey Grandpa
IPL 2021, SRH vs DC: Virat Singh Trolled By SRH Fans | Oneindia Telugu

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎదురీదుతోంది. 160 పరుగుల సునాయాస ఛేదనలో 117కే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. సన్‌రైజర్స్‌ స్టార్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (6), జానీ బెయిర్‌స్టో (38) పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు. ఆర్ అశ్విన్‌ వేసిన నాలుగో ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నించి వార్నర్‌ రనౌటయ్యాడు. ఇక ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఆరో ఓవర్లో సిక్స్‌ కొట్టి జోరుమీదున్న బెయిర్‌స్టో.. అదే ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి శిఖర్ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 7 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

ఓపెనర్లు పెవిలియన్ చేరినా కేన్‌ విలియమ్సన్‌ క్రీజులో ఉండడంతో.. సన్‌రైజర్స్‌ గెలుపుపై ధీమాగానే ఉంది. అయితే విరాట్‌ సింగ్‌ ఇన్నింగ్స్ మ్యాచ్ గతినే మార్చేసింది. విలియమ్సన్‌ బౌండరీలు బాదుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. విరాట్ మాత్రం బంతిని ఎదుర్కోవడానికే నానా తంటాలు పడ్డాడు. 14 బంతుల్లో 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. వరుసగా డాట్ బాల్స్ ఆడుతూ చివరకు అవేశ్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాదాపు 3-4 ఓవర్లు క్రీజులో ఉన్న విరాట్ పరుగులే చేయలేదు. దీంతో కేన్ కూడా ఏమీ చేయకుండా ఉండిపోయాడు. దీంతో సన్‌రైజర్స్‌ రన్ రేట్ కూడా పూర్తిగా పడిపోయింది.

డాట్ బాల్స్ ఆడిన విరాట్‌ సింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. విరాట్ ఆడిన తీరుపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫాన్స్ మండిపడుతూన్నారు. 'అరేయ్ కుయ్యా.. ఆ విరాట్ సింగ్‌ను ఎలా పెట్టుకున్నారు అసలు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఏడ దొరికాడురా ఈ విరాట్ గాడు' అని మరొకరు ట్వీట్ చేశారు. '20 ఓవర్లను 18 ఓవర్లుగా చేశాడు కదరా? ', 'వీడు మనీష్ పాండే కంటే తాతలా ఉన్నాడుగా', 'సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి ఏమైంది' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. మరికొందరు ఫాన్స్ అయితే రాయారని విధంగా కూడా ట్రోల్ చేస్తున్నారు.

నెమ్మదిగా బ్యాటింగ్ చేసి కీలక సమయంలో ఔట్ అయిన మనీష్ పాండేపై కూడా ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫాన్స్ మండిపడిన విషయం తెలిసిందే. కోల్‌కతాపై మనీష్ (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు. బెంగళూరుపై 39 బంతుల్లో 38 రన్స్.. ముంబైపై 7 బంతుల్లో 2 పరుగులు చేసి విమర్శల పాలయ్యాడు. సోషల్ మీడియా వేదికగా పాండేపై మీమ్స్, కామెంట్ల వర్షం కురిపించారు.

Story first published: Monday, April 26, 2021, 7:58 [IST]
Other articles published on Apr 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+