న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ప్చ్.. ముంబైతో మ్యాచ్‌కు కేన్‌మామ దూరం.. బరిలోకి దిగడానికి మరో వారం సమయం!

IPL 2021: SRHs Kane Williamson updates on his injury

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరికొద్ది గంటల్లో ముంబై ఇండియన్స్‌తో ప్రారంభమయ్యే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. ఇప్పటికే అతని గైర్హాజరీలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ..రెండింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టుడగు స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం ముంగిట బోర్లా పడింది.

ముఖ్యంగా కేన్ మామ అవసరమేంటో తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే అతని కోసం సన్‌రైజర్స్ ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ కేన్ మామ గాయం నుంచి పూర్తిగా కోలుకోని మ్యాచ్ బరిలో దిగడానికి మరో వారం సమయం పట్టనుంది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో కేన్ విలియమ్సనే చెప్పాడు. 'గాయం నయమవుతోంది. వారం రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగుతా. రిహాబిలిలేషన్, ప్రాక్టీస్‌కు బ్యాలెన్స్ పాటిస్తున్నా. అయితే ముఖ్యమై విషయం ఏంటంటే గాయం నయమవడంలో పురోగతి ఉంది. అతి తర్వలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తా.'అని విలియమ్సన్ తెలిపాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో సన్‌రైజర్స్ సక్సెస్‌లో కేనమామది కీలక పాత్ర. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో సన్‌రైజర్స్ సెమీఫైనల్స్ చేరిందంటే అతని కేన్ చలువే. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఈ న్యూజిలాండ్ కెప్టెన్.. 45.28 సగటుతో 317 రన్స్ చేశాడు. తాజా సీజన్‌లో కేన్ విలియమ్సన్‌ను తుది జట్టులో ఆడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతని ఎంపికపై క్లారిటీ ఇచ్చింది. గాయం కారణంగానే కేన్ తుది జట్టులో ఉండటం లేదని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో గాయపడ్డ కేన్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

Story first published: Saturday, April 17, 2021, 16:10 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X