ఢిల్లీ ప్లేస్‌లో మా హైదరాబాద్ ఉంటే ముంబై ఈజీగా గెలిచేది! తీవ్ర నైరాశ్యంలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్!

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పెర్ఫెమెన్స్ పట్ల ఆ జట్టు అభిమానులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. అసలు తమ జట్టు గెలుస్తుందనే నమ్మకమే పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆరంభంలో దంచికొట్టడం.. లక్ష్యంవైపు సాఫీగా సాగుతున్నట్లు కనిపించడం.. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలి ఓటమిని ఆహ్వానించడం.. ఆరెంజ్ ఆర్మీకి అలవాటైపోయింది. మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యంతోనే హైదరాబాద్ గత మూడు మ్యాచ్‌ల్లో గెలుపు ముంగిట బొక్కా బోర్లా పడింది. దాంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆరెంజ్ ఆర్మీపై ఆశలు వదులుకున్నారు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఫలితాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ ఫ్యాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెటైర్లు పేల్చుతున్నారు.
ముంబైకి షాక్..
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై రన్నరప్ ఢిల్లీ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.

పోరాడిన ధావన్, లలిత్..
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ధావన్‌కు స్మిత్ జతయ్యాడు. ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు కుదురుగా ఆడారు. రెండో వికెట్‌కు 53 పరుగులు జతయ్యాక పొలార్డ్ బౌలింగ్‌లో స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే ధావన్, రిషభ్ పంత్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్‌పై ముంబై పట్టు బిగుస్తుందా అనిపించింది. లలిత్ యాదవ్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విలువైన పోరాటం చేశాడు. విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో హెట్‌మెయిర్ (9 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి లలిత్ యాదవ్ ఢిల్లీ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.

హైదరాబాద్ ఉంటే ఓడిపోయేది..
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్థానంలో హైదరాబాద్ ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేదని, 19 బంతుల్లో 23 పరుగులు చేయడం కూడా సన్‌రైజర్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు చేత కాదని ఆ జట్టు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో లలిత్ యాదవ్ పోషించిన పాత్రను హైదరాబాద్‌లో ఏ యువ ఆటగాడు రాణించడం లేదని మండిపడుతున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఓటమికి తలవంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీని చూసైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications