For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: వార్నర్ భాయ్.. సెకండాఫ్‌లో సెంచరీ కొట్టాలి.. జట్టులోకి సెలెక్ట్ అయితే తప్పకుండా!

IPL 2021: SRH Fans Request David Warner To Score Century, Warner Replies In His Style
డ్రింక్స్ సర్వ్ చేయకుండా జట్టులో ఉంటే తప్పకుండ సెంచరీ చేస్తా..! - David Warner || Oneindia Telugu

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ దెబ్బతో క్రికెట్‌కు సుదీర్ఘ విరామం ప్రకటించిన డేవిడ్ భాయ్.. ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనదైన వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. అలాగే యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్‌తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్నాడు.

తాజాగా ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా వార్నర్ పోస్ట్‌కు స్పందిస్తూ ఓ అభిమాని.. 'డేవిడ్ భాయ్ ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో నీ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాం?'అని కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ తనదైన రీతిలో బదులిచ్చాడు. 'నేను కూడా సెంచరీ చేయాలనే ఆతృతలో ఉన్నా.. కానీ జట్టులో సెలెక్ట్ అవుతానో లేదో'అని సందేహం వ్యక్తం చేశాడు. జట్టులో ఉంటే మాత్రం ఖచ్చితంగా బాదుతానని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం వార్నర్ చేసిన ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.

డేవిడ్ వార్నర్‌పై వేటు..

డేవిడ్ వార్నర్‌పై వేటు..

భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఫస్టాఫ్ మ్యాచ్‌ల్లో వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో కేవలం 191 రన్సే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా గొప్పగా లేదు. ఇది టీమ్ పర్ఫెమెన్స్‌పై ప్రభావం చూపించింది. దాంతో వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ చాలా కఠినంగా వ్యవహరించింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యుణ్ని చేస్తూ కెప్టెన్సీపై వేటు వేయడమే కాకుండా జట్టు నుంచి తప్పించింది.

కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ఏకైక మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో వార్నర్ 12వ ఆటగాడిగా డ్రింక్స్ అందించాడు. దీన్ని సన్‌రైజర్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడం అదే చివరిసారని ప్రచారం జరిగింది.

సెకండాఫ్‌కు వార్నర్..

సెకండాఫ్‌కు వార్నర్..

కరోనాతో వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు డేవిడ్ వార్నర్‌ దూరంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్‌ తాను ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగతా మ్యాచులు కూడా ఆడతానని క్లారిటీ ఇచ్చేశాడు.

వార్నర్‌ ఐపీఎల్‌ ఆడడంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. కరోనాతో వాయిదా పడిన మిగతా లీగ్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్‌ 15న ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఢిల్లీ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. సన్‌రైజర్స్ చివరిస్థానంలో నిలిచింది.

వార్నర్‌ కెప్టెన్సీలోనే టైటిల్‌..

వార్నర్‌ కెప్టెన్సీలోనే టైటిల్‌..

2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్‌ వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత సన్‌రైజర్స్‌ తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ అందుకుంది.

ఆ సీజన్‌లో వార్నర్‌ బ్యాటింగ్‌లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు. అప్పటినుంచి 2018 సీజన్‌ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా పనిచేసిన వార్నర్‌ ప్రతీసారి ఫ్లేఆఫ్‌కు తీసుకురావడం విశేషం.

ఇదే చివరి సీజనా?

ఇదే చివరి సీజనా?

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ ఆడటం ఇదే చివరిసారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పేలవ బ్యాటింగ్‌తో అతను జట్టుకు భారంగా మారాడు. ఈ పరిస్థితుల్లో వచ్చే సీజన్ కోసం జరిగే మెగా వేలంలో అతన్ని సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోకపోవచ్చు. పైగా మెగా ఆక్షన్ నిబంధనల నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌, కెప్టెన్ కేన్ విలియమ్సన్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యంగ్ సెన్సేషన్ నటరాజన్‌లలో నలుగురిని తీసుకునే చాన్స్ ఉంది.

విదేశీ కోటాలో ఇద్దరు ప్లేయర్లు తీసుకున్నా.. అందులో రషీద్ ఖాన్ ఉండటం ఖాయం. ఈ మిస్టరీ స్పిన్నర్‌ను వదులుకునే సాహసం సన్‌రైజర్స్ చేయకపోవచ్చు. దాంతో మిగిలిన ఓ స్లాట్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం విలియమ్సన్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ సెకండాఫ్‌లో వార్నర్ దుమ్మురేపితే మాత్రం.. ఫ్రాంచైజీ తమ ఆలోచనను మార్చుకోవచ్చు.

Story first published: Wednesday, September 1, 2021, 14:50 [IST]
Other articles published on Sep 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+