
సెంచరీ కొట్టిసేన డేవిడ్ భాయ్..
మార్ష్ కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌ల్లో వరుసగా 87, 24, 69, 108 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. 'బ్యాటింగ్ చేసే క్రమంలో నేనే అసౌకర్యానికి గురవ్వలేదు. రాబోయే చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను'అని చెప్పాడు. తప్పకుండా ఐపీఎల్ ఆడాలని వార్నర్ భావిస్తున్నట్లు అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నది.
ఇక భారత్‌తో వన్డే సిరీస్ మధ్యలో గాయపడ్డ వార్నర్.. దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే చివరి రెండు టెస్టుల్లో ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో దారుణంగా రెండు టెస్టుల్లో వరుసగా 5, 13, 1, 48 పరుగులు చేశాడు. అయితే గాయం నయమవ్వకుండానే బరిలోకి దిగడంతో అది తిరగబెట్టింది. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అతను ఫామ్ అందుకోవడం అభిమానులు ఖుషి అవుతున్నారు.

చెలరేగుతున్న బెయిర్ స్టో..
ఇక భారత్‌తో జరుగుతన్న ఐదు టీ20ల సిరీస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో చెలరేగుతున్నాడు. టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఈ ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ టీ20 సిరీస్‌తో మంచి టచ్‌లోకి వచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 26 నాటౌట్, 20, 40 నాటౌట్, 25 పరుగులతో మెరుపులు మెరిపించాడు. టెస్ట్ సిరీస్‌లో స్పిన్ బౌలింగ్‌లో తడబడ్డ బెయిర్ స్టో.. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లనే టార్గెట్ చేస్తూ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ముందు బెయిర్ స్టో ఫామ్‌లోకి రావడం పట్ల ఆరెంజీ ఆర్మీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టచ్‌లోకి భువనేశ్వర్..
గత ఐపీఎల్ సీజన్‌లో గాయపడి టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న భువనేశ్వర్.. భారత జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లో కొంత తడబడినా..తరువాతి మ్యాచ్‌ల్లో భువీ లయ అందుకున్నాడు. వికెట్లు తీయకున్నా పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో తన మార్క్ బౌలింగ్ పెర్ఫామెన్స్‌ను కనబరుస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో(0/15, 1/28, 0/27, 1/30) రెండు వికెట్లే తీసినప్పటకీ.. పొదుపుగా పరుగులిచ్చాడు. భువీ టచ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.

నట్టూ ఆగయా..
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ నటరాజన్.. గాయం నుంచి కోలుకున్నాడు. ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైనా భుజ గాయం కారణంగా అతను బరిలోకి దిగలేదు. ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్న అతను పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన నటరాజన్ జట్టుతో చేరాడని బీసీసీఐ వెల్లడించింది. యోయో పరీక్షతో పాటు 2 కి.మీ పరుగు పరీక్షలోనూ అతడు నెగ్గినట్లు తెలిపింది. చివరి టీ20 ఆడే అవకాశం ఉంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ నట్టూకు అవకాశం దక్కింది. నట్టూ గాయం నుంచి కోలుకోవడం పట్ల హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
