Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: కేన్ మామ‌కు దక్కని చోటు.. కోల్‌కతాదే బ్యాటింగ్!

SRH bowl, No Kane Williamson, Shakib Al Hasan back for KKR

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేజింగ్‌కే మొగ్గుచూపాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆసక్తికర కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. ఊహించనట్లుగానే స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ అనూహ్యంగా మహ్మద్ నబీ జట్టులోకి వచ్చాడు.

ఓవర్‌సీస్ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు బెయిర్ స్టో, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నారు. ఇక కోల్‌కతా ఓవర్‌సీస్ కొటాలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, ఆండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్ బరిలోకి దిగుతున్నారు.

అయితే విలియమ్సన్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదని అర్థమవుతోంది. ఇక ఈ సీజన్‌‌ కోసం కొత్తగా జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్‌కు నిరాశే ఎదురైంది. మరోవైపు కేకేఆర్ తరఫున హర్భజన్ సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

గత సీజన్‌లో మూడో ప్లేస్‌తో ముగించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం టోర్నీని విజయంతో మొదలుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైటర్స్ కూడా గత సీజన్‌లో తమ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఇరు జట్లలో స్టార్లకు కొదవలేకపోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), వృద్దీమాన్ సాహా, మనీష్ పాండే, జానీ బెయిర్ స్టో(కీపర్), విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్

కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), ఆండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్, ప్యాట్ కమిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తీ

Story first published: Sunday, April 11, 2021, 19:23 [IST]
Other articles published on Apr 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+