
పూర్తిగా కోలుకున్న అయ్యర్
ఐపీఎల్ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్ 8న భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టనుందని అప్పుడే డాక్టర్లు తేల్చేశారు. దీంతో ఐపీఎల్ 2021 మొదటి దశ మ్యాచులకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అయితే తాజాగా అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లా
ఇంగ్లండ్‌తో జరిగిన టోయ్ వన్డేలో గాయపడిన అనంతరం చాలా కుంగిపోయానని, దాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టిందని తాజాగా శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'ప్రస్తుతం నేను అద్భుతమైన అనుభూతిని పొందుతున్నా. నిజాయితీగా చెప్పాలంటే నా ప్రయాణం అద్భుతంగా ఉంది. నేనెప్పుడూ వెనుకడుగు వేయలేదు. కానీ భుజానికి గాయం అయిన తర్వాత కొంచెం కుంగిపోయాను.
అప్పుడు ఏం చేయాలో తోచలేదు. గాయం అయిన వెంటనే ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లా. దాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ గాయం అకస్మాత్తుగా జరిగింది. ఇది క్రీడాకారుల జీవితంలో ఒక భాగం. కాబట్టి నేను ఆ వాస్తవాన్ని అంగీకరించా' అని అయ్యర్ పేర్కొన్నాడు.
IPL 2021: బెంగళూరుకు భారీ షాక్.. ఐపీఎల్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్!!

సందిగ్ధంలో ఢిల్లీ మేనేజ్మెంట్
ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేదాడి జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్‌కు అప్పగించాలా అని ఆలోచన చేస్తుందట.
ఈ విషయాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. 'కెప్టెన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రిషబ్ పంత్ లేదా శ్రేయస్ అయ్యర్.. ఇద్దరిలో ఎవరికీ కెప్టెన్సీ ఇవ్వాలనేదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని ఢిల్లీ మేనేజ్మెంట్ అధికారి ఒకరు చెప్పారు.

శ్రేయాస్ తిరిగి వచ్చినా
ఐపీఎల్ 14వ సీజన్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. లీగ్ వాయిదాపడే సమయానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 8 మ్యాచుల్లో ఢిల్లీ 6 విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను కాదని శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే శ్రేయాస్ తిరిగి వచ్చినా.. పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం తెలుస్తోంది. ఇక అయ్యర్ స్థానంలో స్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. తాజాగా స్మిత్ ఐపీఎల్ రెండో దశకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించాడు.


Click it and Unblock the Notifications
