
గాయంతో సుందర్ ఔట్
అనతి కాలంలోనే వాషింగ్టన్ సుందర్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించడం అతడికి పెద్ద సానుకూలాంశం. ఆల్‌రౌండర్ కోటాలో తన స్తానం నిలుపుకునేవాడు. ఒకప్పుడు కేవలం టీ20లకే సరిపోతాడని భావించిన సుందర్.. ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్లో అదరగొట్టాడు. కీలక సమయంలో జట్టుకు విలువైన పరుగులు అందించాడు. దాంతో అతడిని ఇంగ్లండ్ సిరీసుకు ఎంపిక చేశారు. కానీ అక్కడికెళ్లిన తర్వాత సుందర్ గాయపడ్డాడు. గాయంతో సుందర్ తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఇప్పటికీ అతడు కోలుకోలేదని సమాచారం తెలుస్తోంది. దాంతో సుందర్ ఐపీఎల్ 20221కు దూరమవుతున్నాడని సమాచారం.

సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్
వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆర్‌సీబీ మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్ అనే బౌలర్‌ను ఎంచుకుంది. బెంగాల్ యువ క్రికెటరైన ఆకాశ్ ప్రస్తుతం ఆర్‌సీబీలో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఏదిఏమైనా ఆర్‌సీబీకి సమతూకం తీసుకురావడంలో సుందర్ చాలా కీలకం. అటు బౌలర్‌గా ఇటు బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడంలో అతడే మేటి స్పిన్నర్.
అంతేకాకుండా ఓపెనర్‌గా, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగలడు. ఎక్కడ ఆడినా పరుగులు చేస్తాడు. ఆర్‌సీబీ ఇంతకుముందే శ్రీలంక నుంచి దుష్మంత చమీరా, వానిందు హసరంగను తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో కోచ్ సైమన్ కటిచ్ దూరమవ్వడంతో.. క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసెన్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు.
Avani Lekhara: భారత స్పోర్ట్స్‌కు ఇది చాలా స్పెషల్ మూమెంట్: ప్రధాని

కీలకం కానున్న డేవిడ్, హసరంగ
వానిందు హసరంగ, దుష్మంత చమీరాతో పాటు బిగ్‌బాష్‌లో దుమ్మురేపిన సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌ను ఇటీవలే ఆర్‌సీబీ టీమ్‌లోకి తీసుకుంది. ఆడమ్ జంపా, డానియల్ సామ్స్, ఫిన్ అలెన్ ప్లేస్‌లో ఈ ముగ్గుర్ని తీసుకుంది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్‌ను చేర్చుకుంది. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ ఆయిన హసరంగ ఆర్‌సీబీ జట్టులో కీలకం కానున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో అతనికి జట్టులో చోటు దక్కడం ఖాయం.
6.5 అడుగుల పొడవు ఉండే టిమ్ డేవిడ్.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లకూ ఫ్రీలాన్స్ క్రికెటర్‌గా అందుబాటులో ఉంటాడు. ఇప్పటివరకు ఆడిన 14 టీ20ల్లో 158 స్ట్రయిక్ రేట్‌తో 558 రన్స్ చేశాడు. బీబీఎల్, పీఎస్‌ఎల్‌తో కలిసి మొత్తం 42 మ్యాచ్‌లు ఆడగా.. 1171 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టడంలో డేవిడ్ దిట్ట.

నేరుగా యూఏఈకే
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబయ్ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. అక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు యూఏఈకి ఇంకా బయల్దేరాల్సి ఉంది. బహుశా ఈ రెండు రోజుల్లో అక్కడికి బయల్దేరే అవకాశం ఉంది.
ఆర్సీబీ రెండో దశ షెడ్యూల్‌లో సెప్టెంబర్ 20న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ 2021లో కోహ్లీసేన అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ లేనివిధంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకోనున్నారు.


Click it and Unblock the Notifications












