For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 సెకండాఫ్ ముహుర్తం ఫిక్స్.. 10 డబుల్ హెడర్స్.. 21 రోజుల్లో ఖేల్‌ఖతమ్!

 IPL 2021 second half likely to resume on September 19 in UAE
IPL 2021 Resume On September 19 సెకండాఫ్‌ పూర్తవ్వడం పక్కా | UAE | BCCI || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను పూర్తి చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 29న జరిగే బోర్డు ప్రత్యేక సర్వ సభ్యసమావేశంలో ఈ క్యాష్‌రిచ్ లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌ల నిర్వహణపై ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. ఇంగ్లండ్ వేదికగా పూర్తిచేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని, యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 రోజుల విండోపై బోర్డు దృష్టిసారించిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఇండియా టుడే కూడా సెకండాఫ్ లీగ్ నిర్వహణపై ఓ కథనాన్ని ప్రచురించింది.

సెప్టెంబర్ 19న షురూ.!

సెప్టెంబర్ 19న షురూ.!

ఈ కథనం ప్రకారం ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కు మరోసారి యూఏఈ వేదికగానే జరగనుంది. సెప్టెంబర్ 19 లేదా 20న సెకండాఫ్ లీగ్‌కు తెరలేవనుందని, ఫైనల్ అక్టోబర్ 10న జరగనుందని పేర్కొంది. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది. దాంతో ఆటగాళ్లు సెప్టెంబర్ 15న యూఏఈ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు.

అయితే ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ కోసం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ను కుదిస్తారని ప్రచారం జరిగినా.. ఇది అవాస్తవమని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పేర్కొంది.

సీపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు..

సీపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు..

'5 టెస్ట్‌ల సిరీస్‌లో మార్పు చేయమని ఈసీబీని బీసీసీఐ కోరే అవకాశం లేదు. ఆటగాళ్లు సెప్టెంబర్ 15న దుబాయ్‌కు వచ్చే అవకాశం ఉంది. బబుల్ టూ బబుల్ ప్రయాణం కాబట్టి ప్లేయర్లంతా మూడు రోజుల క్వారంటైన్‌లోనే ఉండనున్నారు'అని ఇండియా టుడే స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ తెలిపాడు. లీగ్ సాధ్య సాధ్యాలను అతను విశ్లేషించాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2021 సెకండాఫ్ నేపథ్యంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్‌లో కూడా మార్పులు జరుగుతాయన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 19 వరకు సీపీఎల్ జరగాల్సి ఉంది.

అందరికీ వ్యాక్సిన్..

అందరికీ వ్యాక్సిన్..

అయితే ఈ షెడ్యూల్‌‌‌ను మార్చాలని బీసీసీఐ.. విండీస్ క్రికెట్‌తో సంప్రదింపులు జరుపుతుందని మజుందార్ పేర్కొన్నాడు. ఈ చర్చల్లో కేకేఆర్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. సెప్టెంబర్ 14, 15లోగా సీపీఎల్ ముగిసేలా షెడ్యూల్‌ను మార్చనున్నారని తెలిపాడు. ది హండ్రెడ్ లీగ్ కూడా జూలై 24 నుంచి 21 మధ్యే జరగనుందని, ఆ లీగ్ ఆడిన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగుమమవుతుందన్నాడు. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లందరికి తప్పనిసరి వ్యాక్సిన్ ఇస్తారని, అందరూ సెప్టెంబర్ 15 వరకు దుబాయ్ చేరుకుంటారని తెలిపాడు.

21 రోజుల్లో పూర్తి..

21 రోజుల్లో పూర్తి..

'ఇక ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌ను 21 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. మిగిలిపోయిన 31 మ్యాచ్‌ల్లో 27 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ ఉన్నాయి. ఈ 21 రోజుల్లో 9 నుంచి 10 డబుల్ హెడర్స్ జరిగే అవకాశం ఉంది. దాంతో 20 మ్యాచ్‌లు పూర్తవుతాయి కాబట్టి ఏడు సింగిల్ డే మ్యాచ్‌లు ఉండనున్నాయి. ఈ లెక్కన సెప్టెంబర్ 19 లేదా 20న లీగ్‌ను రీస్టార్ చేసినా అక్టోబర్ 10న ముగించవచ్చు. ఈ విండోపైనే బీసీసీఐ కూడా దృష్టిపెట్టింది. 10 డబుల్ హెడర్స్, 7 సింగిల్ డే మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్‌తో 21 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బీసీసీఐ అధికారులు, ఫ్రాంచైజీ యజమానులు, సీఈవోలు, ఇతర వర్గాల సమాచారం ప్రకారమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.'అని బొరియా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 25, 2021, 19:25 [IST]
Other articles published on May 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+