Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ప్చ్.. మళ్లీ ముంబైదే టైటిల్.. అట్టడుగున చెన్నై.. స్టార్ క్రికెటర్ జోస్యం!

 IPL 2021: Scott Styris reveals his prediction MI to win, CSK to finish at bottom’

ముంబై: కరోనా కారణంగా జరుగుతుందో లేదో అనుకున్న 13వ ఎడిషన్‌‌ యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌ గడ్డపై అందించిన వినోదాన్ని మరచిపోకముందే ఐపీఎల్‌‌ హంగామా మళ్లీ మొదలైంది..! ఆరు నెలలు తిరగకుండానే క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు కిక్ ఇచ్చేందుకు మెగా లీగ్‌‌ మళ్లీ ముస్తాబైంది..! సిక్సర్ల వర్షంతో పాటు ఉత్కంఠ పోరాటాలు, అద్భుత ప్రదర్శనలతో మాంచి మజానందించే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మరో 6 రోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 9న ముంబై, బెంగళూరు మధ్య జరిగే తొలి పోరుతో లీగ్‌ సంగ్రామానికి తెరలేవనుండగా.. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌ మధ్య ఖాళీ స్టేడియాల్లో కొత్త నిబంధనలతో ఈ సీజన్‌ జరుగనుంది. అయితే అప్పుడే ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్ ఎవరనే చర్చ ఊపందుకుంది.

 ముంబైదే టైటిల్..

ముంబైదే టైటిల్..

టీమ్ విశ్లేషణలు, అంచనాలతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌ ట్విటర్‌ వేదికగా తన అంచనాను వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఆడనున్న ఎనిమిది జట్లు ఏ స్థానంలో ఉంటాయో అంచనా వేస్తూ.. టైటిల్‌ కొల్లగొట్టేది ఎవరు.. ఆఖరిస్థానంలో ఉండేది ఎవరో చెప్పుకొచ్చాడు. స్టైరిస్‌ చెప్పిన ప్రకారం .. డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ నిలబెట్టుకుంటుందని.. ఆ జట్టు ఇప్పుడు అన్ని జట్లకన్నా పటిష్టంగా కనిపిస్తుందని.. అందుకే వారు ఫేవరెట్‌గా మారారని చెప్పాడు.

ప్చ్.. ఆర్‌సీబీ..

ప్చ్.. ఆర్‌సీబీ..

ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్‌‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు. ఐపీఎల్ వేలాన్ని పంజాబ్ చక్కగా వాడుకుందని తెలిపాడు. మరోసారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఐదో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్‌ మారినా రాజస్థాన్ రాయల్స్‌ తలరాత మారదని.. అయితే వేలంలో కోట్లు పెట్టి కొన్న క్రిస్‌ మోరిస్‌తో పాటు జోఫ్రా ఆర్చర్‌లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని.. అయినా ఆ జట్టు 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు.

అట్టడుగున చెన్నై

అట్టడుగున చెన్నై

ఇక ఆల్‌రౌండర్ల బలంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఏడో స్థానంలో ఉంటుందన్నాడు. గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఈసారి ఆఖరి స్థానానికి పరిమితమవుతందని.. ఆ జట్టు ఈసారి తీవ్రంగా నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయని స్టైరిస్‌ చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్‌కే అట్టడుగున నిలుస్తుందని చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత సీజన్ మినహా ఆ జట్టు ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కైనా అర్హత సాధించింది. అలాంటి జట్టు చిట్ట చివరన నిలుస్తుందనడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రిడిక్షన్ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ట్రోల్ చేసిన ఆర్‌ఆర్..

ట్రోల్ చేసిన ఆర్‌ఆర్..

ఇక స్టైరిస్ అంచనాపై రాజస్థాన్ రాయల్స్ తనదైన శైలిలో స్పందించింది. 'నీ అంచనాలను అదుపులో పెట్టుకో'అనే అర్థంలో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సారి తమ జట్టు పగ్గాలను యువ ఆటగాడైన సంజూ శాంసన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు క్రిస్ మోరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ జట్టుకు జోఫ్రా ఆర్చర్ దూరమవ్వడం ప్రతికూలంగా మారింది.

Story first published: Saturday, April 3, 2021, 15:09 [IST]
Other articles published on Apr 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+