Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs SRH:ప్చ్.. కెప్టెన్ మారినా సన్‌రైజర్స్ రాత మారలేదు..రాజస్థాన్ ఘన విజయం!

Rajasthan Royals win by 55 runs, Hyderabad suffer 6th defeat

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కెప్టెన్ మారినా.. తుది జట్టులో మార్పులు చేసినా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. చెత్త ఫీల్డింగ్.. పేలవ బౌలింగ్.. పసలేని బ్యాటింగ్‌తో ఆ జట్టు మరో ఘోర ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగులతో చిత్తయింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) భాద్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్‌ను అవకాశంగా మార్చుకున్న ఈ ఇద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.

అనంతరం హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(31), మనీష్ పాండే(30)తో సహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరీస్ మూడేసి వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ తీశారు.

అంతకుముందు 221 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో(30), బెయిర్ స్టో, మనీష్ పాండే(30) ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టోకుండా 57 పరుగులు చేసింది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే మనీష్ పాండే‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టోను రాహుల్ తెవాటియా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(20), విజయ్ శంకర్(8) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ విజయ్ శంకర్‌ను క్రిస్ మోరీస్.. కేన్ మామను కార్తీక్ త్యాగి ఔట్ చేయడంతో హైదరాబాద్ 105 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ(5 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 17) మెరుపులు మెరిపించాడు. కానీ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నబీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్‌తో ఆసక్తి రేకెత్తించినా.. రాజస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. మోరీస్.. సమద్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో కేదార్ జాదవ్(19), రషీద్ ఖాన్(0) కూడా ఔటయ్యారు.

Story first published: Sunday, May 2, 2021, 19:26 [IST]
Other articles published on May 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+