RR vs SRH: కొంపముంచిన విజయ్ శంకర్, పాండే.. సెంచరీతో చెలరేగిన బట్లర్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం!

న్యూఢిల్లీ: జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అతనికి తోడుగా సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆదిలోనే ఈ ఇద్దరు ఇచ్చిన సునాయస క్యాచ్‌లను విజయ్ శంకర్, మనీష్ పాండేలు నేలపాలు చేయడంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. చెత్త ఫీల్డింగ్‌తో పరుగులిచ్చుకోవడంలో పోటీపడ్డ సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు.

కొంప ముంచిన విజయ్ శంకర్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(12)ను రషీద్ ఖాన్ ఎల్బీగా పెవిలియన్‌గా చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూశాంసన్ ఫస్ట్ బాల్‌నే భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే రషీద్ ఖాన్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. అప్పటికే సన్‌రైజర్స్ రివ్యూ కోల్పోవడంతో సమీక్ష కోరే అవకాశం లేకుండా పోయింది. కానీ రిప్లేలో అది ఔటని తేలింది. ఆ వెంటనే బట్లర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలపాలు చేశాడు. అప్పుడు బట్లర్ చేసిన పరుగులు 7 మాత్రమే. భువీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో బట్లర్ రెండు బౌండరీలు బాదడంతో రాజస్థాన్ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది.

సిక్సర్ల విధ్వంసం..
ఆ తర్వాత మరింత జోరు కనబర్చి ఈ జోడీ.. విజయ్ శంకర్ వేసిన ఏడో ఓవర్‌లో 2 సిక్స్‌లతో 18 పరుగులు పిండుకుంది. ఆ తర్వాత రషీద్, సందీప్ కట్టడి చేసారు. అయితే సందీప్ శర్మ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మనీష్ పాండే నేలపాలు చేశాడు. అప్పటికి శాంసన్ 23 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశాన్ని అందుకున్న అతను చెలరేగాడు. ప్రతీ ఓవర్‌లో బౌండరీ బాదిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. సందీప్ శర్మ వేసిన 13 ఓవర్ మూడో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన బట్లర్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడాడు. ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ భారీ షాట్లు ఆడాడు.

బట్లర్ సెంచరీ..
నబీ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 21 రన్స్ పిండుకున్నాడు. బౌలర్ మారినా తన జోరును మాత్రం ఆపలేదు. అతని ధాటికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కే పరిమితమైన శాంసన్.. విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అబ్దుల్ సమద్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 150 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. వికెట్ పోయినా ఆ మరుసటి బంతినే బౌండరీ తరలించిన బట్లర్.. ఆ వెంటనే సింగిల్ తీసి 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 కెరీర్‌లోనే అతనికిది ఫస్ట్ సెంచరీ కావడం గమనార్హం. ఇక సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో బట్లర్ ఆఖరి బంతికి వెనుదిరిగినా.. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో 11 రన్స్ రావడంతో రాజస్థాన్ రాయల్స్ 220 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications